Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు

Business

క్యాబ్ వినియోగదారులు నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. క్యాబ్ నిర్వహణా సంస్థలైన ఓలా, ఉబర్, మేరు, ర్యాపిడో, జుగ్ను వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

Centre’s notice to cab aggregators: క్యాబ్ వినియోగదారులు నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. క్యాబ్ నిర్వహణా సంస్థలైన ఓలా, ఉబర్, మేరు, ర్యాపిడో, జుగ్ను వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కొంతకాలంగా క్యాబ్ సంస్థలపై వినియోగదారులు భారీ ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.

క్యాబ్ సంస్థలు ఉన్నట్లుంచి ఛార్జీలు పెంచుతున్నాయి. ఏసీ వాడేందుకు ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతోపాటు క్యాన్సిలేషన్ ఛార్జీలు, కొన్ని రూట్లలో సర్వీసులు తగ్గిపోవడం, డ్రైవర్లు డిజిటల్ పేమెంట్స్ బదులు క్యాష్ కావాలని డిమాండ్ చేయడం వంటి అంశాల్లో ఎక్కువగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పందించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ అయిన ‘సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)’ క్యాబ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

Related Posts

Business

ఓపెన్‌ఏఐ 150 బిలియన్ డాలర్ల మూల్యంతో నిధుల సేకరణ చర్చల్లో – బ్లూమ్‌బర్గ్ న్యూస్ నివేదిక

చాట్‌జీపీటీ వంటి పాపులర్ చాట్‌బాట్‌ని రూపొందించిన ఓపెన్‌ఏఐ, సుమారు 6.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిదారుల నుండి సేకరించేందుకు చర్చిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఈ నిధుల సేకరణకు సంబంధించి బ్యాంకుల నుంచి మరో 5 బిలియన్

Business

నిఫ్టీ 50 25,000 మార్క్‌ను తిరిగి పొందింది; ఐటీ, ఔషధ రంగ స్టాక్స్ ఆధారంగా సెన్సెక్స్ ర్యాలీ

మంగళవారం నాడు నిఫ్టీ 50 సూచీ 25,000 మార్క్‌ను దాటింది, అలాగే సెన్సెక్స్ కూడా వాల్ స్ట్రీట్‌లో లాభాలు నమోదు కావడంతో ర్యాలీ చేసింది, ఔషధ రంగ స్టాక్స్ కూడా పెరిగాయి. ఈ పెరుగుదల

Business

టాటా పవర్‌ షేర్లపై దృష్టి: తమిళనాడులోని టాటా గ్రూప్‌ సంస్థ సౌరకణాల ఉత్పత్తిని ప్రారంభించింది

మంగళవారం ఉదయం టాటా పవర్ కంపెనీ లిమిటెడ్‌ షేర్లపై పెట్టుబడిదారుల దృష్టి ఉంది, ముఖ్యంగా టాటా గ్రూప్‌ సంస్థ తమ 4.3 గిగావాట్ల సౌర కణాలు మరియు మాడ్యూల్ ఉత్పత్తి ప్లాంట్‌ను తమిళనాడులోని తిరునెల్వేలిలో

Business

సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 2% పెరిగాయి, ఇండియాలో అతి పెద్ద విండ్ ఎనర్జీ ఆర్డర్ సాధన

సెప్టెంబర్ 9 న సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 2 శాతానికి పైగా పెరిగాయి, ఎందుకంటే సంస్థ NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నుండి 1,166 మెగావాట్ల (MW) భారతదేశపు అతిపెద్ద విండ్ ఎనర్జీ ఆర్డర్