Reliance Just Dial : జస్ట్‌ డయల్‌‌తో రిలయన్స్‌ బిగ్ డీల్..

News

ప్రముఖ దేశీయ దేశీ ఆన్‌లైన్‌ కామర్స్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (RRVL‌) జస్ట్‌ డయల్‌ (Just Dial) మధ్య భారీ డీల్ కుదిరింది. డీల్‌ విలువ సుమారు రూ.3,497 కోట్లుగా అంచనా.

Reliance Just Dial Deal : ప్రముఖ దేశీయ దేశీ ఆన్‌లైన్‌ కామర్స్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (RRVL‌) జస్ట్‌ డయల్‌ (Just Dial) మధ్య భారీ డీల్ కుదిరింది. డీల్‌ విలువ సుమారు రూ.3,497 కోట్లుగా అంచనా. జస్ట్ డెయిల్ నుంచి 40.95 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు నివేదిక వెల్లడించింది. సెబీ టేకోవర్‌ నిబంధనల ప్రకారం.. మరో 26శాతం వాటాను 2.17 కోట్ల షేర్ల ఓపెన్‌ ఆఫర్‌ అందిస్తోంది.

Just Dial వ్యవస్థాపకుడు VSS మణిమేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని RRVL వెల్లడించింది. జస్ట్‌ డయల్‌లో ఇన్వెస్ట్‌ చేసే నిధుల ద్వారా లోకల్‌ లిస్టింగ్, కామర్స్‌ ప్లాట్‌ఫాంగా సేవలు అందించనుంది. లక్షల భాగస్వామ్య వ్యాపార సంస్థలకు డిజిటల్‌ డీల్‌ ప్రయోజనకరంగా ఉంటుందని RRVL డైరెక్టర్‌ ఈషా అంబానీ తెలిపారు.

లక్ష్యాల సాధనకు, వ్యాపార పురోగతికి రిలయన్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రయోజనకరంగా ఉంటుందని మణి పేర్కొన్నారు. రెండు కంపెనీల మధ్య ఒప్పందం ప్రకారం.. రూ. 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.1,022.25 రేటు చొప్పున ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన RRVLకు కేటాయించనున్నారు. వీఎస్‌ఎస్‌ మణి నుంచి షేరు రూ.1,020 రేటు చొప్పున RRVL రూ.1.31 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది.

జస్ట్‌ డయల్‌ కు సంబంధించి వ్యాపార నిర్వాహణ కార్యకలాపాలు 1996 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. మొబైల్, యాప్స్, వెబ్‌సైట్, టెలిఫోన్‌ హాట్‌లైన్‌ వంటి ద్వారా జస్ట్‌డయల్‌ సర్వీసులను పొందే యూజర్ల సంఖ్య 3 నెలల సగటు సుమారు రూ.13 కోట్ల వరకు పెరిగినట్టు అంచనా.

Related Posts

News

వారానికి 6 రోజులు పని చేయాలా? 5 రోజులు చాలు!

నేటి వేగంగా మారుతున్న జీవన విధానంలో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువసేపు పనిచేయడం వల్ల వారు కుటుంబంతో గడిపే సమయం తగ్గి, మానసిక, శారీరక ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ నష్టం కలిగించే

News

సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌: రైల్వే షాకింగ్ నిర్ణయం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు భారతీయ రైల్వేలోకి ప్రవేశించిన తర్వాత ప్యాసింజర్ల నుండి మంచి స్పందన లభించింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ రైళ్లకు విశేష డిమాండ్ ఉంది. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా, ప్రయాణికులకు

News

టాటా మోటార్స్ షేర్లు 5% కుప్పకూలాయి; UBS 20% తగ్గుదల అవకాశాన్ని చూసింది

సెప్టెంబర్ 11న ప్రారంభ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్లు దాదాపు 5 శాతం పడిపోయి, నిఫ్టీ 50లో అత్యధిక నష్టాల్లో ఒకటిగా నిలిచాయి. ఉదయం 09.52 గంటలకు టాటా మోటార్స్ షేర్లు NSEలో రూ.

News

ఆథర్ ఎనర్జీ IPOకి సిద్ధం, రూ. 3,100 కోట్ల తాజా షేర్ల విడుదలతో సహా

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఆథర్ ఎనర్జీ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ ఐపీఓలో రూ. 3,100 కోట్ల విలువైన తాజా