RBI: కరెన్సీ నోట్లపై దేవతల చిత్రాలు సాధ్యమేనా..? రిజర్వు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

News

దేశంలో అమలులో ఉన్న కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఇతర ఫోటోలు ముద్రించాలనే డిమాండ్ పై రిజర్వు బ్యాంకు ఇండియా 2010లోనే స్పష్టత ఇచ్చింది. దేశంలోని పలువురు ప్రముఖుల చిత్రాలు, నోబెల్ బహుమతి గ్రహీతల ఫోటోలు కరెన్సీ నోట్లపై ముద్రించే విషయమై పూణేకు చెందిన వ్యాపారవేత్త..

కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు హిందూ దేవతలైన లక్ష్మిదేవి, గణేష్ ఫోటోలను ముద్రించాలంటూ ఓ కొత్త డిమాండ్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెరపైకి తీసుకొచ్చారు. ఈ డిమాండ్ పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలతో పాటు, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ తో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు చేసిన కొన్ని వివాదస్పద వ్యాఖ్యల కారణంగా వారు హిందువులకు వ్యతిరేకమనే ప్రచారాన్ని బీజేపీ విస్తృతం చేసింది. దీంతో ఆ విమర్శ నుంచి బయటపడేందుకు కేజ్రీవాల్ కరెన్సీ నోట్లపై హిందూ దేవతల ఫోటోలు ముద్రించాలనే డిమాండ్ తీసుకువచ్చినట్లు కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇది సాధ్యం కాదని తెలిసే అరవింద్ కేజ్రీవాల్ అవసరం లేని ఓ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారనే వాదన మరోవైపు వినిపిస్తోంది.

ఈ డిమాండ్ ను బీజేపీ వ్యతిరేకించకపోయినా, హిందూ వ్యతిరేకి అయిన అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ స్వార్థం కోసం ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. వాస్తవానికి కరెన్సీ నోట్లపై దేశానికి చెందిన పలువురు ప్రముఖుల చిత్రాలు కూడా ముద్రించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం మహాత్మా గాంధీ చిత్రాన్ని మాత్రమే కర్సెనీ నోట్లపై ముద్రించాలని నిర్ణయం తీసుకుని.. దానినే ఆర్బీఐ పాటిస్తూ వస్తోంది. కరెన్సీ నోట్లపై లక్ష్మిదేవి, గణేశుడి చిత్రాలు ముద్రించాలనే డిమాండ్ తెరపైకి వచ్చిన క్రమంలో రిజర్వు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

Related Posts

News

LPG Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హోలీకి ముందు సామాన్య ప్రజలకు పెట్రోలియం సంస్థలు గట్టి షాకిచ్చాయి. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ.

News

యాప్ స్టోర్, Nfc, iMessage: కొత్త యూరోపియన్ నియమాల కారణంగా తదుపరి ఐఫోన్ ఎలా మారుతుందో ఇక్కడ ఉంది

డిజిటల్ మార్కెట్ల చట్టం 2023లో అమల్లోకి వస్తుంది మరియు వచ్చే ఏడాది పూర్తిగా అమలులోకి వస్తుంది. EU దేశాల్లో, ఈ రోజు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు సేవలపై అనేక ఆంక్షలను తొలగించాల్సిందిగా Appleని ఒత్తిడి

News

Indian Railway: వేరొకరి టికెట్‌పై రైల్లో ప్రయాణించవచ్చు.. ఎలాగో తెలుసా..

రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు ప్రయాణం చేయవచ్చు. మీకు టికెట్ బుక్ కాకపోయినా.. ఈ సౌకర్యంతో.. మీరు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారా.? అయితే మీకో ముఖ్య గమనిక. రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు

News

Pension Scheme: ఇకపై వారికి ఆ పెన్షన్ పధకం వర్తించదు.. అమలులోకి న్యూ రూల్స్.!

తాజాగా ఈ పెన్షన్ పధకాల్లో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. అర్హులైనవారికి మాత్రమే..
కేంద్రం పలు పెన్షన్ పధకాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయిస్ ప్రావిడెంట్