Petrol, Diesel price Today: స్థిరంగానే కొనసాగుతున్న పెట్రో ధరలు.. కొన్ని చోట్ల పెరిగిన రేట్లు.. ప్రధాన నగరాల్లో..

News

Petrol, Diesel Rates Today: చమురు ధరలకు కొన్ని రోజులనుంచి బ్రేక్ పడుతూ వస్తోంది. దీంతో సామాన్యులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. ఇటీవల పెట్రోల్,

Petrol, Diesel Rates Today: చమురు ధరలకు కొన్ని రోజులనుంచి బ్రేక్ పడుతూ వస్తోంది. దీంతో సామాన్యులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం పెరిగిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు తల్లడిల్లారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో అందరినుంచి ఆందోళన వక్తమైంది. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ కూడా దాటింది. ప్రస్తుతం కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. అన్నిచోట్ల ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.51 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.83 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిన్న పెట్రోల్‌ ధర రూ.94.13 ఉండగా.. సోమవారం స్వల్పంగా తగ్గింది. 93.99 కి చేరింది. డీజిల్‌ ధర రూ.88.05 కి చేరింది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.12 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.15గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.52 గా ఉంది. డీజిల్‌ ధర రూ.90.04 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 96.01 ఉండగా.. డీజిల్‌ ధర రూ.89.52 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.69 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.22గా ఉంది.

Related Posts

News

సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) సిస్టమ్స్ మార్కెట్ పరిమాణం, 2024 ట్రెండ్‌లు, వ్యాపార వృద్ధి, రాబోయే అభివృద్ధి, విశ్లేషణ, భాగస్వామ్యం, పరిశోధన మరియు 2032 వరకు సూచన

గ్లోబల్ సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) సిస్టమ్స్ మార్కెట్ పరిమాణం & వృద్ధి అంచనాలు [2024-2032] –
కీవర్డ్ మార్కెట్ పరిమాణం – గ్లోబల్ సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా)

News

ఆల్ సాలిడ్ స్టేట్ థిన్-ఫిల్మ్ లిథియం-అయాన్ బ్యాటరీ మార్కెట్ వాటా, పరిమాణం, 2024 పరిశ్రమ వృద్ధి, గ్లోబల్ మేజర్ కంపెనీల ప్రొఫైల్, కాంపిటేటివ్ ల్యాండ్‌స్కేప్ మరియు ముఖ్య ప్రాంతాలు 2032

గ్లోబల్ ఆల్ సాలిడ్ స్టేట్ థిన్-ఫిల్మ్ లిథియం-అయాన్ బ్యాటరీ మార్కెట్ పరిమాణం & వృద్ధి అంచనాలు [2024-2032] –
కీవర్డ్ మార్కెట్ పరిమాణం – గ్లోబల్ ఆల్ సాలిడ్ స్టేట్ థిన్-ఫిల్మ్ లిథియం-అయాన్ బ్యాటరీ మార్కెట్

News

ఆప్టికల్ కమ్యూనికేషన్ క్యాబినెట్‌లు మార్కెట్ సైజు, 2024 ట్రెండ్‌లు, షేర్, గ్రోత్, ఫ్యూచర్ డిమాండ్, 2032 వరకు ప్రధాన పార్టిసిపెంట్ మరియు సూచన ద్వారా విశ్లేషణ

Global Optical Communication Cabinets Market Size & Growth Forecast [2024-2032] –
Keyword Market Size – The Global Optical Communication Cabinets Market research report provides a

News

వందే భారత్ స్లీపర్: న్యూ ఢిల్లీ-కాశ్మీర్ రూట్‌లో కొత్త రైలు ప్రయాణం

జనవరి 2025 నుండి కొత్త రైలు సేవలు ప్రారంభం
భారతీయ రైల్వే వ్యవస్థలో వందే భారత్ రైళ్లు కీలక మార్పులకు నాంది పెట్టాయి. వేగం, సౌకర్యం, ప్రయాణంలో అనుభవానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఈ రైళ్లు