Pension Scheme: ఇకపై వారికి ఆ పెన్షన్ పధకం వర్తించదు.. అమలులోకి న్యూ రూల్స్.!

News

తాజాగా ఈ పెన్షన్ పధకాల్లో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. అర్హులైనవారికి మాత్రమే..

కేంద్రం పలు పెన్షన్ పధకాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్, అటల్ పెన్షన్ యోజన పధకాలు ముఖ్యమైనవి. అసంఘటిత కార్మికుల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు తమ పధకాలు చేరాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు పలు పధకాలను ప్రవేశపెట్టింది. అయితే తాజాగా ఈ పెన్షన్ పధకాల్లో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. అర్హులైనవారికి మాత్రమే పధకాల ప్రయోజనాలు అందేలా కొన్ని నియమ నిబంధనలను మార్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా అటల్ పెన్షన్ యోజన పధకానికి సంబంధించిన రూల్స్ మారాయి. ఇకపై ఈ స్కీంలో చేరేందుకు అందరూ అర్హులు కాదు. ఈ పధకంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు చేరకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

ఎవరైతే అటల్ పెన్షన్ యోజన పధకంలో లబ్దిదారుడిగా ఉండి.. ఆ తర్వాత ఆదాయపు పన్ను చెల్లింపుదారుడిగా మారితే.. వారికి ఇకపై ఈ స్కీం వర్తించదు. అప్పటివరకు జమ చేసిన మొత్తాన్ని కేంద్రం తిరిగి ఇచ్చేయనుంది. ఈ రూల్స్ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.

వాస్తవానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఆగస్ట్ 10, 2022 నాటి నోటిఫికేషన్‌లో, ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు లేదా పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన కింద తమ ఖాతాను తెరవలేరని పేర్కొంది. కాగా, అటల్ పెన్షన్ యోజన పధకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015వ సంవత్సరం మే 9వ తేదీన ప్రారంభించింది. ఈ పెన్షన్ పధకంలో డబ్బులు జమ చేసే లబ్దిదారులకు 60 ఏళ్లు దాటిన తర్వాత రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్ లభిస్తుంది. ఇది కూడా మీరు జమ చేసిన డబ్బు మొత్తంపై ఆధారపడి ఉంటుంది.

Related Posts

News

LPG Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హోలీకి ముందు సామాన్య ప్రజలకు పెట్రోలియం సంస్థలు గట్టి షాకిచ్చాయి. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ.

News

యాప్ స్టోర్, Nfc, iMessage: కొత్త యూరోపియన్ నియమాల కారణంగా తదుపరి ఐఫోన్ ఎలా మారుతుందో ఇక్కడ ఉంది

డిజిటల్ మార్కెట్ల చట్టం 2023లో అమల్లోకి వస్తుంది మరియు వచ్చే ఏడాది పూర్తిగా అమలులోకి వస్తుంది. EU దేశాల్లో, ఈ రోజు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు సేవలపై అనేక ఆంక్షలను తొలగించాల్సిందిగా Appleని ఒత్తిడి

News

RBI: కరెన్సీ నోట్లపై దేవతల చిత్రాలు సాధ్యమేనా..? రిజర్వు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

దేశంలో అమలులో ఉన్న కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఇతర ఫోటోలు ముద్రించాలనే డిమాండ్ పై రిజర్వు బ్యాంకు ఇండియా 2010లోనే స్పష్టత ఇచ్చింది. దేశంలోని పలువురు ప్రముఖుల చిత్రాలు, నోబెల్

News

Indian Railway: వేరొకరి టికెట్‌పై రైల్లో ప్రయాణించవచ్చు.. ఎలాగో తెలుసా..

రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు ప్రయాణం చేయవచ్చు. మీకు టికెట్ బుక్ కాకపోయినా.. ఈ సౌకర్యంతో.. మీరు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారా.? అయితే మీకో ముఖ్య గమనిక. రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు