Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. సిప్, లంప్సమ్‌లో ఏది బెటర్..

News

ప్రస్తుతం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన అవకాశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు..

ప్రస్తుతం స్టాక్ మార్కెట్(Stock Market) సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన అవకాశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ప్రభావితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకమొత్తంలో(lumpsum) ఇన్వెస్ట్ చేయాలా లేక సిప్(SIP) సాయంతో ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా అనే ప్రశ్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల మదిలో మెదులుతోంది. పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం మంచిది కాదు.

మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉంటే, పెట్టుబడిదారులు దానిని తెలివిగా సద్వినియోగం చేసుకోవాలి. స్మార్ట్ ఇన్వెస్టర్లు క్రమంగా మిగులు నిధులను దీర్ఘకాలికంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారని నిపుణులు అంటున్నారు. ఇది కాకుండా.. పోర్ట్‌ఫోలియోను వైవిధ్యభరితంగా ఉంచాలని కూడా పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ రెండింటిలోనూ పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్ హెడ్ చింతన్ హరియా తెలిపారు. అటువంటి పరిస్థితిలో పెట్టుబడిదారులు ప్రత్యేక 12-18 నెలల్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలి. ఇది గొప్ప పెట్టుబడి అవకాశం. భారత ఆర్థిక వ్యవస్థ, భారత స్టాక్ మార్కెట్ పనితీరు దీర్ఘకాలికంగా బలంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ జితేంద్ర సోలంకి మాట్లాడుతూ మీ వద్ద మిగులు నిధులు ఉంటే ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఇదొక గొప్ప అవకాశమన్నారు. మీకు ఇష్టమైన ఉత్పత్తి ఎప్పుడు తగ్గింపుతో లభిస్తుందో, అప్పుడు కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయకూడదని వారు అంటున్నారు. వచ్చే 6-12 నెలల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.

Related Posts

News

Recurring Deposit: రికరింగ్ డిపాజిట్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసుకోండి! – prajaavani.com

మీ ఆదాయం నుంచి నెల నెలా కొంత మొత్తం పొదుపు చేయాలనుకుంటే రికరింగ్ డిపాజిట్(RD) అందుకు సరైనదని చెప్పవచ్చు. దీని ద్వారా మీ సొమ్మును సురక్షితంగా పొదుపు చేసుకోగలుగుతారు. (మరింత…)

News

Reliance Just Dial : జస్ట్‌ డయల్‌‌తో రిలయన్స్‌ బిగ్ డీల్..

ప్రముఖ దేశీయ దేశీ ఆన్‌లైన్‌ కామర్స్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (RRVL‌) జస్ట్‌ డయల్‌ (Just Dial) మధ్య భారీ డీల్ కుదిరింది. డీల్‌ విలువ సుమారు రూ.3,497 కోట్లుగా అంచనా. (మరింత…)

News

ఆత్మనిర్భర్ భారత్: మోదీ చెప్పిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌ ఏమయింది, నిధులు ఎవరికి చేరాయి? – prajaavani.com

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాలలో స్వల్ప మెరుగుదల కనిపించింది. (మరింత…)