తెలంగాణలో ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ సాయం.. ఎవరెవరికి ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు?

News

గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్ విధించింది మొదలు… ఇప్పటివరకూ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో జీతాలు ఆగిపోవడంతో కూలీలుగా మారిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కూరగాయల దుకాణాలు, చాయ్ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు పెట్టుకున్న ఉదంతాలు కూడా చూశాం. తెలంగాణలో దాదాపు ఏడాది విరామం తర్వాత తిరిగి గత ఫిబ్రవరిలో స్కూళ్లు ప్రారంభమవడంతో వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో కొద్ది రోజులకే మళ్లీ పాఠశాలలను ప్రభుత్వం మూసేయాలని ఆదేశించింది.

దీంతో ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రభుత్వం తమను ఎలాగైనా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాలు చాలా కాలంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారికి సాయం అందించేలా తాజాగా నిర్ణయం తీసుకుంది.

పాఠశాలలను మళ్లీ తెరిచే వరకూ ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి నెలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయంతోపాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర సీఎం కేసీఆర్ గురువారం ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 10,807 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఉపాధ్యాయులుగా సుమారు 1.28 లక్షల మంది పనిచేస్తున్నారు. మరో 17 వేల మంది బోధనేతర సిబ్బందిగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన ఆర్థిక సాయం రూపంలోనే ప్రభుత్వం వీరి కోసం నెలకు సుమారు రూ.29 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయుల సంఖ్య రెండు లక్షలకుపైగానే ఉందని తెలంగాణలోని గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (టీఆర్ఎస్ఎంఏ) అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు బీబీసీతో అన్నారు.

ప్రభుత్వ సాయానికి అర్హులైనవారు తమ బ్యాంకు ఖాతా సహా ఇతర వివరాలను తెలియజేస్తూ జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మలను విధివిధానాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ అంశమై వీరు జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, డీఎస్‌వోలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత మంత్రి గంగుల కమలాకర్ బీబీసీతో మాట్లాడుతూ… అర్హులను ఏ ప్రాతిపదికన గుర్తించబోతున్నారో వివరించారు.

Related Posts

News

ఆదాని పోర్ట్స్ షేర్లు మార్చిలో నెలవారీ కార్గో వాల్యూమ్స్ తమ గరిష్ఠానికి చేరుకోవడంతో రికార్డ్ స్థాయికి ఎగసింది

ఆదాని పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకానమిక్ జోన్ లిమిటెడ్ యొక్క షేర్లు సోమవారం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి, మార్చి 2024లో దాని అత్యధిక నెలవారీ కార్గో వాల్యూమ్స్ 38 మిలియన్ మెట్రిక్ టన్నుల పైన

News

వ్యాపార ఆలోచన: జ్యూస్ వ్యాపారంతో ఒక నెల లో.. రూ.1.5 లక్షల ఆదాయం..!

జ్యూస్ వ్యాపారం ఒక కొన్ని ప్రారంభిక ఖచ్చితంగా ఆర్థిక అవకాశం ఉంటుంది. ఇది సులభంగా ప్రారంభించబడినప్పుడు, మరియు కొన్ని ఉపయోగకరమైన సమాచారాన్ని పొందగలరు.
ఆహారం మరియు పోషకాల ప్రాధాన్యత తెలుసుకోవడం అనేకంగా మానవులకు తెలుసు. ఆదివారం

News

LPG Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హోలీకి ముందు సామాన్య ప్రజలకు పెట్రోలియం సంస్థలు గట్టి షాకిచ్చాయి. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ.

News

యాప్ స్టోర్, Nfc, iMessage: కొత్త యూరోపియన్ నియమాల కారణంగా తదుపరి ఐఫోన్ ఎలా మారుతుందో ఇక్కడ ఉంది

డిజిటల్ మార్కెట్ల చట్టం 2023లో అమల్లోకి వస్తుంది మరియు వచ్చే ఏడాది పూర్తిగా అమలులోకి వస్తుంది. EU దేశాల్లో, ఈ రోజు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు సేవలపై అనేక ఆంక్షలను తొలగించాల్సిందిగా Appleని ఒత్తిడి