Vivad se Vishwas Scheme: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు – prajaavani.com

Business

Vivad se Vishwas Scheme: పన్ను చెల్లింపుదారులకు ఎన్నో శుభవార్తలు అందుతున్నాయి. తాజాగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ పన్ను చెల్లింపుదారులకు..

Vivad se Vishwas Scheme: పన్ను చెల్లింపుదారులకు ఎన్నో శుభవార్తలు అందుతున్నాయి. తాజాగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ పన్ను చెల్లింపుదారులకు ఆదివారం శుభవార్త ప్రకటించింది. వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద ఎటువంటి వంటి అదనపు రుసుముల లేకుండా పన్ను చెల్లించేందుకు సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ ప్రకటించింది. అయితే ఈ గడువు ఆగస్టు 31 వరకు ఉండేది. దీనిని సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించింది. వివాద్‌ సే విశ్వాస్‌ ద్వారా పన్ను చెల్లింపులో భాగంగా ఫారమ్‌-3 వల్ల ఇబ్బందులు ఎదురైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీడీటీ వెల్లడించింది.

అదనపు ఛార్జీలతో..
కాగా, అదనపు ఛార్జీలతో పన్నులు చెల్లించేందుకు అక్టోబరు 31కే చివరి తేది అని తెలిపింది. ఇకపై గడువు పొడిగింపులు ఉండవని సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 29న సీబీడీటీ ప్రకటన జారీ చేసింది.

వివాద్ సే విశ్వాస్ పథకం అంటే ఏమిటి?
వివాద్ సే విశ్వాస్ పథకం పెండింగ్‌లో ఉన్న పన్నులను చెల్లించే పన్ను చెల్లింపుదారులకు వడ్డీ, జరిమానాపై పూర్తి మాఫీని అందిస్తుంది. బహుళ ఫోరమ్‌లలో వివాదంలో పన్ను డిమాండ్లు లాక్ చేయబడిన వారికి ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం లక్ష్యం.

వివాద్‌ సేవ విశ్వాస్‌ పథకం నియమం:
పన్ను చెల్లింపుదారులు డిక్లరేషన్‌ చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2021 కాగా, ప్రభుత్వం చెల్లింపులు చేయడానికి ఆగస్టు 31 చివరి తేదీగా నిర్ణయించింది. ఇప్పుడు తాజాగా ఆ గడువును పెంచింది. కావాలంటే కొంత వడ్డీ చెల్లించి అక్టోబర్‌ 31లోపు పన్ను చెల్లించవచ్చు. వివాద్‌ సే విశ్వాస్‌ పథకంలో పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను చట్టం కింద ఏదైనా నేరానికి వడ్డీ, జరిమానా, ప్రాసిక్యూషన్‌ కోసం ఏవైనా విచారణల నుంచి మినహాయించబడతాడు. కాగా, పెండింగ్‌లో ఉన్న పన్ను విషయాలను పరిష్కరించడానికి ప్రభుత్వం మార్చి 17, 2020న వివాద్‌ సే పథకాన్ని ప్రారంభించింది.

వివాదస్పద పన్నులు మాత్రమే..
ఈ పథకం కింద, పన్ను చెల్లింపుదారు వివాదాస్పద పన్నులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పన్ను శాఖ ద్వారా ఈ మొత్తానికి వడ్డీ లేదా పెనాల్టీ విధించబడదు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న పన్ను చెల్లింపుదారుడు.. ఈ పథకం వ్యవధి ఎప్పటికప్పుడు పొడిగించబడుతుంది. తద్వారా మరిన్ని కేసులు పరిష్కరించబడతాయి. పథకం కింద నిర్ణయించిన మొత్తానికి, పన్ను చెల్లింపుదారుడు డబ్బు చెల్లించాల్సిన నిర్దిష్ట తేదీని ఎంపిక చేస్తారు.

Related Posts

Business

టాటా మోటార్స్: లాభాల లక్ష్యం 1089 రూపాయలు

మేము టాటా మోటార్స్ వార్షిక విశ్లేషకుల సమావేశంలో పాల్గొన్నాము, అక్కడ కంపెనీ తన వాణిజ్య వాహనాలు (CV), ప్రయాణికుల వాహనాలు (PV) మరియు విద్యుత్ వాహనాలు (EV) వ్యాపారాల సమగ్ర దృష్టాంతాన్ని మరియు వారి

Business

లాభం తెచ్చిన Suzlon స్టాక్ 52.48 రూపాయిల వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది: కంపెనీ ఆర్డర్ బుక్ 3.3 గిగావాట్ల వద్ద నిలిచింది, 1,035.15 మెగావాట్ల ఆర్డర్లు పొందింది

ఇండియా మార్కెట్లు ఈ రోజు నష్టంతో ప్రారంభమయ్యాయి, BSE సెన్సెక్స్ సూచిక 2.70 శాతం, NSE నిఫ్టీ-50 సూచిక 2.25 శాతం తగ్గింది. మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ, ఒక మల్టీబాగర్ స్టాక్ 4.34 శాతం

Business

జొమాటో ఈఎస్ఓపీ ఖర్చు మార్చి త్రైమాసికంలో దాదాపు రెట్టింపు అయినది

గత ఏడాది అదే కాలంలో రూ. 84 కోట్ల నుండి ఈ మార్చి త్రైమాసికంలో రూ. 161 కోట్లకు జొమాటో యొక్క ఈఎస్ఓపీ (ఉద్యోగి షేరు ఎంపిక పథకం) ఖర్చు పెరిగింది. జొమాటో సీఎఫ్ఓ

Business

ఉల్ట్రాటెక్ సిమెంట్ Q4 ఫలితాలు: లాభాల్లో 35.2% వృద్ధి, ప్రతి షేరుకు రూ.70 డివిడెండ్

ఉల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ FY24 Q4లో రూ.2,258.58 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది, ఇది గత సంవత్సరం Q4లో నమోదైన రూ.1,670.10 కోట్లతో పోలిస్తే 35.2% వృద్ధి. ఇది కంపెనీకి గణనీయమైన లాభాల