Standing instructions: ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త మార్పులతో మీ జేబుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

Business

క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్లపై స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్లకు సంబంధించి అక్టోబరు ఒకటి నుంచి పలు కీలక మార్పులు జరగబోతున్నాయి.

ఈ మార్పులతో మీ బిల్లు చెల్లింపులు ప్రభావితం అవుతాయి. ఈ అంశంపై వచ్చే అనేక సందేహాలకు హైదరాబాద్‌కి చెందిన ఆర్ధిక, పెట్టుబడుల నిపుణులు నాగేంద్ర సాయి బీబీసీ ప్రేక్షకులకు అందించిన సమాధానాలు చూద్దాం. మన అవసరాల కోసం రకరకాల కంపెనీలకు బిల్లులు కడతాం. కరెంటు, ఫోన్, ఇంటర్నెట్, ఓటీటీ వీడియో సేవలు, ఇన్సూరెన్స్ ప్రీమియం, పిల్లల చదువుల కోసం వివిధ యాప్‌లు.. ఇలా చాలా వాటికి డబ్బు చెల్లిస్తాం. కొన్నిటిని నెలకు, కొన్ని మూడు నెలలకూ, కొన్ని ఏడాదికి ఒకసారి చెల్లిస్తాం. మనం ఆ బిల్లు సమయానికి చెల్లించడం మర్చిపోతే ఆ సర్వీసు ఆగిపోతుంది. ఆలస్యం అయితే అదనపు చార్జీ పడుతుంది. అలా కాకుండా ఆ బిల్లు మనకు అందగానే, మన క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నుంచో లేదా మన వ్యాలెట్ నుంచో నేరుగా ఆ బిల్లు మొత్తం కట్ అయ్యేలా ఒక ఏర్పాటు చేయవచ్చు. దీన్నే స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటారు. ఆటో డెబిట్ అనే పేరుతో ఇది పాపులర్.

ఆన్‌లైన్లో జరిగే ప్రతీ వాయిదాకీ అడిషినల్ ఫాక్టర్ అథెంటికేషన్ (రెండుసార్లు ఓకే చెప్పడం) (ఓటీపీ ద్వారా) ఉండాలనేది ఆర్బీఐ నిబంధన. కానీ, ఈ స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్న సందర్భంలో బిల్లు వసూలు చేసే కంపెనీ వారు ఇలా డబుల్ ఓకే లేకుండానే నెలనెలా డబ్బు వసూలు చేసుకోవచ్చు. ఇకపై ఆ పద్ధతి చెల్లదని ఆర్బీఐ నిర్ణయించింది. అంటే మనం ఆన్‌లైన్లో చెల్లించే ప్రతీసారీ మనం ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేస్తేనే డబ్బు మన కార్డ్ నుంచి కట్ అయ్యేలా ఉండాలనేది ఆర్బీఐ కొత్త రూల్. దీనివల్ల కష్టమర్లకు భరోసా, భద్రత ఉంటుందనేది ఆర్బీఐ విధానం.

వాస్తవానికి 2020వ సంత్సవరం నుంచీ ఆర్బీఐ ఇందు కోసం ప్రయత్నం చేస్తోంది. 2021 ఏప్రిల్ 1 నుంచి ఇది అమలు కావాల్సి ఉంది. కానీ అప్పటికి చాలా బ్యాంకులు ఈ విషయమై సాఫ్ట్‌వేర్ పరంగా సిద్ధం కాలేదు. దీంతో బ్యాంకుల సంఘం వారి విజ్ఞప్తి మేరకు అమలును వాయిదా వేసింది ఆర్బీఐ. తాజాగా 2021 అక్టోబరు 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే 75 శాతానికి పైగా బ్యాంకులు ఈ విధానానికి సన్నద్ధం అయ్యాయి. మిగిలిన చిన్నా చితకా బ్యాంకులు మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. ఆ బ్యాంకుల ఖాతాదారులకు కాస్త ఇబ్బంది తప్పక పోవచ్చు. అయితే అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ పద్ధతికి రెడీగా ఉన్నాయి. చాలా వరకూ బ్యాంకులు, కార్డ్ కంపెనీలు (మాస్టర్, వీసా, రూపే) వారు తమ సర్వర్లలో మార్పులు ఇప్పటికే చేశారు. అంతేకాదు తమ కష్టమర్లకు ఈ విషయమై మెసేజీలు, మెయిల్స్ కూడా పంపారు. భారతదేశంలో సుమారు 90 కోట్ల వరకూ క్రెడిట్, డెబిట్ కార్డులుంటాయని అంచనా. వాటన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే మొబైల్ వ్యాలెట్లు (పేటీఎం, మొబి క్విక్ మొదలైనవి) వాటికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.

Related Posts

Business

జొమాటో ఈఎస్ఓపీ ఖర్చు మార్చి త్రైమాసికంలో దాదాపు రెట్టింపు అయినది

గత ఏడాది అదే కాలంలో రూ. 84 కోట్ల నుండి ఈ మార్చి త్రైమాసికంలో రూ. 161 కోట్లకు జొమాటో యొక్క ఈఎస్ఓపీ (ఉద్యోగి షేరు ఎంపిక పథకం) ఖర్చు పెరిగింది. జొమాటో సీఎఫ్ఓ

Business

ఉల్ట్రాటెక్ సిమెంట్ Q4 ఫలితాలు: లాభాల్లో 35.2% వృద్ధి, ప్రతి షేరుకు రూ.70 డివిడెండ్

ఉల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ FY24 Q4లో రూ.2,258.58 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది, ఇది గత సంవత్సరం Q4లో నమోదైన రూ.1,670.10 కోట్లతో పోలిస్తే 35.2% వృద్ధి. ఇది కంపెనీకి గణనీయమైన లాభాల

Business

మార్చి 15న భారతీయ స్టాక్ మార్కెట్ నుండి ఏమి ఆశించాలి

ప్రపంచ విపరీత మార్కెట్ సూచనలను బట్టి భారతీయ స్టాక్ మార్కెట్ సూచికలు శుక్రవారం తగ్గిన స్థాయిలో ప్రారంభించబడవచ్చు.
గిఫ్ట్ నిఫ్టీ పై ట్రెండ్లు కూడా భారతీయ ప్రామాణిక సూచికకు గ్యాప్-డౌన్ ప్రారంభం సూచిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ

Business

ఆర్‌బీఐ నిబంధనలను అనుసరించడానికి టాటా సన్స్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల పై పని చేస్తున్నారు: నివేదిక

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చేత ఉన్న నిబంధనలను అనుసరించడానికి, ఆర్థిక సేవల సంస్థ టాటా క్యాపిటల్‌లో ఉన్న వాటాను మరొక సంస్థకు బదిలీ చేయడం ఒక ఎంపికగా టాటా సన్స్ పరిగణలో