RBI: క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా.. టెన్షన్ వద్దు.. ఈ కొత్త రూల్‌ తెలుసుకోండి..

Business

మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా.? దాని బిల్లును సకాలంలో చెల్లిస్తున్నారా.? లేక ఎప్పుడూ ఆలస్యంగానే బిల్లు పే చేస్తున్నారా.?

మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా.? దాని బిల్లును సకాలంలో చెల్లిస్తున్నారా.? లేక ఎప్పుడూ ఆలస్యంగానే బిల్లు పే చేస్తున్నారా.? ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నట్లయితే.. టెన్షన్ వద్దు.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సమయానికి డబ్బులు అకౌంట్‌లో లేకపోయినా.. ఏదైనా అత్యవసరం పడటమో.. లేదా మర్చిపోయినా.. ఇలా కారణాలు ఏదైనా కొంతమంది అప్పుడప్పుడూ క్రెడిట్ కార్డు బిల్లును ఆలస్యంగా చెల్లిస్తుంటారు. ఇక అలా చేయడం వల్ల ఆలస్య రుసుము, అదనపు వడ్డీ బిల్లుతో సహా ఎక్స్‌ట్రాగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సిబిల్ స్కోర్‌లో కూడా కోత పడుతుందని టెన్షన్ పడుతుంటారు. ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ కొత్త రూల్‌ను అమలులోకి తీసుకొచ్చింది.

క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు.. బకాయి రోజుల సమాచారాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇవ్వాలని.. పాస్ట్ డ్యూ డేట్ మూడు రోజులు దాటితేనే.. ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని పేర్కొంది. దీని బట్టి చూస్తే.. బిల్లు చెల్లించే డేట్ దాటినా.. మూడు రోజుల్లోపు ఖాతాదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా తమ బిల్లులు చెల్లించవచ్చు. లాస్ట్ డేట్ దాటిన మూడు రోజుల తర్వాత కూడా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతేనే అదనపు ఛార్జీలు, ఆలస్య రుసుము వంటివి విధిస్తారు.

Related Posts

Business

బైజూస్‌కు సమస్యలు ఎదురవుతున్నాయి

భారతదేశంలోని ఒక న్యాయవాద న్యాయస్థానం మంగళవారం భారతదేశంలో అత్యంత విలువైన స్టార్టప్ అయిన బైజూస్‌కు దివాళా నడిపింపులు ప్రారంభించాయి, ఇది దేశ క్రికెట్ బోర్డు నుండి వచ్చిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా. ఈ తీర్పు యాంత్రిక

Business

టాటా మోటార్స్ Q1 అప్‌డేట్: గ్లోబల్ హోల్‌సేల్స్‌లో 2% వృద్ధి

టాటా మోటార్స్ గ్లోబల్ హోల్‌సేల్స్ 2024 జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో 329,847 యూనిట్లకు చేరుకున్నాయి, ఇది ఏడాది కాలంలో 2 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సోమవారం ఎక్స్చేంజ్‌లకు

Business

టాటా మోటార్స్: లాభాల లక్ష్యం 1089 రూపాయలు

మేము టాటా మోటార్స్ వార్షిక విశ్లేషకుల సమావేశంలో పాల్గొన్నాము, అక్కడ కంపెనీ తన వాణిజ్య వాహనాలు (CV), ప్రయాణికుల వాహనాలు (PV) మరియు విద్యుత్ వాహనాలు (EV) వ్యాపారాల సమగ్ర దృష్టాంతాన్ని మరియు వారి

Business

లాభం తెచ్చిన Suzlon స్టాక్ 52.48 రూపాయిల వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది: కంపెనీ ఆర్డర్ బుక్ 3.3 గిగావాట్ల వద్ద నిలిచింది, 1,035.15 మెగావాట్ల ఆర్డర్లు పొందింది

ఇండియా మార్కెట్లు ఈ రోజు నష్టంతో ప్రారంభమయ్యాయి, BSE సెన్సెక్స్ సూచిక 2.70 శాతం, NSE నిఫ్టీ-50 సూచిక 2.25 శాతం తగ్గింది. మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ, ఒక మల్టీబాగర్ స్టాక్ 4.34 శాతం