LIC: ఎల్ఐసి కొత్త పాలసీ.. ఒకే ప్రీమియం.. జీవితకాలం పెన్షన్.. పూర్తివివరాలు తెలుసుకోండి..

Business

జీవిత బీమా సంస్థ- ఎల్‌ఐసి తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను ప్రకటిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఎల్‌ఐసి పాలసీలపై ప్రజలు విశ్వాసంతో ఉంటారు. తాజాగా న్యూ జీవన్ శాంతి పేరిట పెన్షన్ లింక్డ్..

జీవిత బీమా సంస్థ- ఎల్‌ఐసి తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను ప్రకటిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఎల్‌ఐసి పాలసీలపై ప్రజలు విశ్వాసంతో ఉంటారు. తాజాగా న్యూ జీవన్ శాంతి పేరిట పెన్షన్ లింక్డ్ బీమాతో ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తోంది. ఈ పాలసీలో ఒక్కసారి పెట్టుబడి పెడితే..జీవితాంతం పెన్షన్ అందుకునే అవకాశముంది. వృద్ధాప్యంలో ఖర్చుల కోసం ఆలోచించేవారికి ఈ బీమా మంచి ఎంపిక అవుతుంది. పెద్ద వయసులో జీవితానికి భద్రత కల్పించే మంచి పథకంగా దీనిని చెప్పుకోవచ్చు. ఒక్కసారే పెట్టుబడి పెడితే జీవితమంతా పెన్షన్ గ్యారంటీ లభిస్తుంది. ఈ పథకం ఎల్ఐసీకు చెందిన పాత జీవన్ పాలసీ వంటిదే. జీవన్ శాంతి పాలసీలో రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటిది తక్షణ ఎన్యుటీ కాగా రెండవది డిఫర్డ్ ఎన్యుటీ. ఇదొక సింగిల్ ప్రీమియం ప్లాన్. తక్షణ ఎన్యుటీలో పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ సౌలభ్యం లభిస్తుంది. ఇక రెండవ డిఫర్డ్ ఎన్యుటీలో పాలసీ తీసుకున్న తరువాత అంటే 5,10,15 లేదా 20 ఏళ్ల తరువాత పెన్షన్ సౌలభ్యం లభిస్తుంది.

ఈ పాలసీలో పెన్షన్ గ్యారంటీ ఉంటుంది. పెట్టుబడి, వయస్సు, డిఫర్మెంట్ పీరియడ్ ప్రకారం పెన్షన్ ఎంతనేది వర్తిస్తుంది. పెట్టుబడి,పెన్షన్ ప్రారంభానికి మధ్య కాలవ్యవధి ఎంత ఎక్కువగా ఉంది లేదా వయస్సు ఎంత ఎక్కువగా ఉందో పెన్షన్ కూడా అంతే లభిస్తుంది.

ఈ ఎల్ఐసీ పాలసీ కోసం కనీస వయస్సు 30 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 85 ఏళ్లుగా ఉంది. అంతేకాకుండా జీవన్ శాంతి పాలసీలో రుణం, పెన్షన్ ప్రారంభమైన ఒక ఏడాది తరువాత దీన్ని సరెండర్ చేయవచ్చు. పెన్షన్ ప్రారంభమైన 3 నెలల తరువాత అందించవచ్చు. రెండు ఆప్షన్లలో పాలసీ తీసుకునేటప్పుడు ఏడాది వడ్డీ గ్యారంటీ ఉంటుంది. ఈ పాలసీలో విభిన్నమైన వార్షిక ప్రత్యామ్నాయాలు, వార్షిక చెల్లింపుల సౌలభ్యముంది. ఒకసారి ఎంచుకున్న ఆప్షన్‌ను తిరిగి మార్చే వీలుండదు. ఈ పాలసీని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకునే సౌలభ్యం ఉంది.

Related Posts

Business

ఓపెన్‌ఏఐ 150 బిలియన్ డాలర్ల మూల్యంతో నిధుల సేకరణ చర్చల్లో – బ్లూమ్‌బర్గ్ న్యూస్ నివేదిక

చాట్‌జీపీటీ వంటి పాపులర్ చాట్‌బాట్‌ని రూపొందించిన ఓపెన్‌ఏఐ, సుమారు 6.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిదారుల నుండి సేకరించేందుకు చర్చిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఈ నిధుల సేకరణకు సంబంధించి బ్యాంకుల నుంచి మరో 5 బిలియన్

Business

నిఫ్టీ 50 25,000 మార్క్‌ను తిరిగి పొందింది; ఐటీ, ఔషధ రంగ స్టాక్స్ ఆధారంగా సెన్సెక్స్ ర్యాలీ

మంగళవారం నాడు నిఫ్టీ 50 సూచీ 25,000 మార్క్‌ను దాటింది, అలాగే సెన్సెక్స్ కూడా వాల్ స్ట్రీట్‌లో లాభాలు నమోదు కావడంతో ర్యాలీ చేసింది, ఔషధ రంగ స్టాక్స్ కూడా పెరిగాయి. ఈ పెరుగుదల

Business

టాటా పవర్‌ షేర్లపై దృష్టి: తమిళనాడులోని టాటా గ్రూప్‌ సంస్థ సౌరకణాల ఉత్పత్తిని ప్రారంభించింది

మంగళవారం ఉదయం టాటా పవర్ కంపెనీ లిమిటెడ్‌ షేర్లపై పెట్టుబడిదారుల దృష్టి ఉంది, ముఖ్యంగా టాటా గ్రూప్‌ సంస్థ తమ 4.3 గిగావాట్ల సౌర కణాలు మరియు మాడ్యూల్ ఉత్పత్తి ప్లాంట్‌ను తమిళనాడులోని తిరునెల్వేలిలో

Business

సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 2% పెరిగాయి, ఇండియాలో అతి పెద్ద విండ్ ఎనర్జీ ఆర్డర్ సాధన

సెప్టెంబర్ 9 న సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 2 శాతానికి పైగా పెరిగాయి, ఎందుకంటే సంస్థ NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నుండి 1,166 మెగావాట్ల (MW) భారతదేశపు అతిపెద్ద విండ్ ఎనర్జీ ఆర్డర్