Google Pay FD: ఎలాంటి బ్యాంకు ఖాతా తెరవకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై స్పందించిన గూగుల్‌ పే

Business

Google Pay: టెక్‌ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్‌ పే తాజాగా ఫిక్సిడ్‌ డిపాజిట్లు కూడా ఆఫర్‌ చేస్తోందన్న వస్తున్న వార్తల నేపథ్యంలో కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలను..

Google Pay: టెక్‌ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్‌ పే తాజాగా ఫిక్సిడ్‌ డిపాజిట్లు కూడా ఆఫర్‌ చేస్తోందన్న వస్తున్న వార్తల నేపథ్యంలో కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలను నేరుగా ప్రస్తావించకుండా.. తాము సంస్థలతో భాగస్వామ్యం ద్వారానే భారత్‌లో సర్వీసులు అందిస్తున్నామని గూగుల్‌ పే స్పష్టం చేసింది. పలు సందర్భాలలో కొన్ని ఆఫర్లను తామే స్వయంగా అందిస్తున్నామనే వార్తలు వస్తున్నాయని, అవి వాస్తవం కాదని ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. చాలా వ్యాపారాలు కొత్త వినియోగదారులకు చేరువయ్యేందుకు తమ ప్లాట్‌ఫాం ఒక మాధ్యమంగా ఉపయోగపడుతోందని గూగుల్‌ పేర్కొంది.

కాగా, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో డిజిటల్‌గా ఫిక్సిడ్‌ డిపాజిట్లు తెరిచే సౌలభ్యాన్ని గూగుల్‌ పే ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఖాతాదారు ప్రత్యేకంగా సేవింగ్స్‌ ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్‌ ఖాతా తెరవకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ చేసే సదుపాయం పరిశ్రమలో తొలిసారిగా తాము ఆఫర్‌ చేస్తున్నట్టు ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (SFB) ప్రకటించింది. ఒక ఏడాదిపాటు చేసే ఎఫ్‌డీలపై 6.35 శాతం వరకు వడ్డీ ఉంటుందని ఫైనాన్స్‌ బ్యాంక్‌ పేర్కొంది. రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ గ్యారంటీ ఉంటుందని వివరించింది. ఎలాంటి బ్యాంకు ఖాతా లేకుండా గూగుల్‌ పేలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే ప్రక్రియ రెండు నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు.

కాగా, వివిధ బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఇక చిన్న చిన్న బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

Related Posts

Business

Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు

క్యాబ్ వినియోగదారులు నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. క్యాబ్ నిర్వహణా సంస్థలైన ఓలా, ఉబర్, మేరు, ర్యాపిడో, జుగ్ను వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. (మరింత…)

Business

SBI : ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్, వడ్డీ రేట్లు తగ్గింపు.. అమల్లోకి కొత్త రూల్స్

నవంబర్ నెల ముగిసింది. కొత్త నెల డిసెంబర్ లోకి ఎంటర్ అయిపోయాం. అదే సమయంలో కొత్త రూల్స్ కూడా అమల్లోకి వచ్చేశాయి. డిసెంబర్ 1 నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. ఈ కారణంగా సామాన్యులపై..

Business

Standing instructions: ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త మార్పులతో మీ జేబుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్లపై స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్లకు సంబంధించి అక్టోబరు ఒకటి నుంచి పలు కీలక మార్పులు జరగబోతున్నాయి. (మరింత…)