మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..! అయితే నవంబర్‌ 30 లోపు 5లక్షలు మీ సొంతం..

Business

Deposit Insurance: ప్రస్తుతం దేశంలోని అనేక సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం కింద నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ

Deposit Insurance: ప్రస్తుతం దేశంలోని అనేక సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం కింద నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ బ్యాంకులలో ఫ్రాడ్‌ జరగడం వల్ల రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) వీటిని నిషేధించింది. దీంతో ఈ బ్యాంకు డిపాజిటర్లు నష్టపోకుండా ఉండేందుకు త్వరలో ఒక సెటిల్‌మెంట్ చేయనుంది. వచ్చే 90 రోజుల్లో డిపాజిటర్లకు రూ.5 లక్షలు చెల్లించాలని సెప్టెంబర్ 1న ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన నవంబర్ 30, 2021 వరకు డిపాజిటర్లు వారి డబ్బును తిరిగి పొందవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టు 27 న సర్క్యులర్ జారీ చేసింది.

డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) చట్టం, 2021 సెక్షన్ 1 ప్రకారం సబ్ సెక్షన్ (2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సెప్టెంబర్ 1వ తేదీన అమలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఆ డిపాజిటర్లందరు రూ.5 లక్షలు పొందుతారు. అయితే బ్యాంక్ డిపాజిట్ గ్యారెంటీ చట్టం ఆమోదం పొందకముందే మారటోరియంపై నడుస్తున్న బ్యాంకుల డిపాజిటర్లకు కూడా రూ.5 లక్షలు అందుతాయి. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ మారటోరియంలో నడుస్తున్న బ్యాంకులలో గుణలోని గ్రాహా కో-ఆపరేటివ్ బ్యాంక్, మధ్యప్రదేశ్‌కు చెందిన దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, విజయవాడ, నాసిక్‌లోని ఇండిపెండెన్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పేర్లు ఉన్నాయి.

ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ 90 రోజుల కాలాన్ని 45-45 రోజులుగా విభజించింది. బ్యాంకులు మొదటి 45 రోజుల్లో తమ డిపాజిటర్ల రికార్డులను సేకరించి ఈ సమాచారాన్ని DICGC కి ఇస్తాయి. మిగతా 45 రోజుల్లో DICGC అన్ని క్లెయిమ్‌లను ప్రాసెస్ చేస్తూ వస్తుంది. రూ.5 లక్షలు కస్టమర్లకు తిరిగి చెల్లిస్తుంది. గతంలో బ్యాంకులు ముంచేసిన డబ్బులు పొందడానికి 8-10 సంవత్సరాలు పట్టేది కానీ ఇప్పుడు అదే పని 90 రోజుల్లో కంప్లీట్‌ అవుతుందని ఇటీవల ఆర్థిక మంత్రి తెలిపారు. ఖాతాదారులకు 5 లక్షల రూపాయలు, బ్యాంకులో డిపాజిట్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్‌, వడ్డీ ఇవ్వాలనే నిబంధన ఉంది. ఎక్కువగా PMC బ్యాంక్ దీని ప్రయోజనాన్ని పొందుతుంది.

Related Posts

Business

Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు

క్యాబ్ వినియోగదారులు నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. క్యాబ్ నిర్వహణా సంస్థలైన ఓలా, ఉబర్, మేరు, ర్యాపిడో, జుగ్ను వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. (మరింత…)

Business

SBI : ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్, వడ్డీ రేట్లు తగ్గింపు.. అమల్లోకి కొత్త రూల్స్

నవంబర్ నెల ముగిసింది. కొత్త నెల డిసెంబర్ లోకి ఎంటర్ అయిపోయాం. అదే సమయంలో కొత్త రూల్స్ కూడా అమల్లోకి వచ్చేశాయి. డిసెంబర్ 1 నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. ఈ కారణంగా సామాన్యులపై..

Business

Standing instructions: ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త మార్పులతో మీ జేబుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్లపై స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్లకు సంబంధించి అక్టోబరు ఒకటి నుంచి పలు కీలక మార్పులు జరగబోతున్నాయి. (మరింత…)