Recurring Deposit: రికరింగ్ డిపాజిట్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసుకోండి! – prajaavani.com

News

మీ ఆదాయం నుంచి నెల నెలా కొంత మొత్తం పొదుపు చేయాలనుకుంటే రికరింగ్ డిపాజిట్(RD) అందుకు సరైనదని చెప్పవచ్చు. దీని ద్వారా మీ సొమ్మును సురక్షితంగా పొదుపు చేసుకోగలుగుతారు.

Recurring Deposit: మీ ఆదాయం నుంచి నెల నెలా కొంత మొత్తం పొదుపు చేయాలనుకుంటే రికరింగ్ డిపాజిట్(RD) అందుకు సరైనదని చెప్పవచ్చు. దీని ద్వారా మీ సొమ్మును సురక్షితంగా పొదుపు చేసుకోగలుగుతారు. అదేవిధంగా మీ భవిష్యత్ ఆర్ధిక అవసరాల కోసం డబ్బు జాగ్రత్త చేసుకోగలుగుతారు. ఆర్డీ లలో ఉండే సౌలభ్యం ఏమిటంటే..మీరు చిన్న చిన్న మొత్తాలలో పొడుపు చేసుకోవచ్చు. దానికి రికరింగ్ గా వడ్డీ పొందవచ్చు. పొడుపు ఖాతా కంటే.. ఇది చాలా ఉత్తమమైనది. రికరింగ్ డిపాజిట్ చేయాలనుకుంటే.. ఏ బ్యాంకులో వడ్డీరేటు ఎక్కువ వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ వడ్డీ వచ్చే బ్యాంకులో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మీకు వచ్చే సొమ్ము అంత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు యస్ బ్యాంక్ ప్రస్తుతం RD పై 6.50% మరియు IDFC ఫస్ట్ ఇండియా బ్యాంక్ 6% వరకు వడ్డీని అందిస్తోంది. అదే విధంగా ఆర్డీ గురించి.. దానిపై వివిధ బ్యాంకులు ఇస్తున్న వడ్డీ గురించి తెలుసుకుందాం.

రికరింగ్ డిపాజిట్ లేదా RD మీకు పెద్ద మొత్తాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. మీరు దీనిని పిగ్గీ బ్యాంక్ లాగా ఉపయోగించవచ్చు. జీతం వచ్చినప్పుడు ప్రతి నెలా మీరు నిర్ణీత మొత్తాన్ని అందులో జమ చేయడం ద్వారా పరిపక్వత సమయంలో మీ చేతిలో పెద్ద మొత్తాన్ని అందుకోగలుగుతారు. దీని పరిపక్వత(మెచ్యూరిటీ) కాలం సాధారణంగా 6 నెలల నుండి 10 సంవత్సరాల మధ్య ఉంటుంది. అయితే, దేశంలోని అతి పెద్ద బ్యాంక్ SBI లో, మీరు కనీసం 1 సంవత్సరం పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

మీరు ఈ RD స్కీమ్‌లో నెలకు కనీసం రూ.100 పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఇంతకు మించిన మొత్తాన్ని 10 గుణిజాలలో జమ చేయవచ్చు. గరిష్ట డిపాజిట్ మొత్తానికి పరిమితి లేదు. RD అనేది ఒక రకమైన చిన్న పొదుపు పథకం. ఏ వ్యక్తి అయినా దాని ఖాతాను ఏ బ్యాంకులోనైనా తెరవవచ్చు. ఈ ఖాతాలను అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ బ్యాంకులలో తెరవవచ్చు.

Related Posts

News

వారానికి 6 రోజులు పని చేయాలా? 5 రోజులు చాలు!

నేటి వేగంగా మారుతున్న జీవన విధానంలో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువసేపు పనిచేయడం వల్ల వారు కుటుంబంతో గడిపే సమయం తగ్గి, మానసిక, శారీరక ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ నష్టం కలిగించే

News

సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌: రైల్వే షాకింగ్ నిర్ణయం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు భారతీయ రైల్వేలోకి ప్రవేశించిన తర్వాత ప్యాసింజర్ల నుండి మంచి స్పందన లభించింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ రైళ్లకు విశేష డిమాండ్ ఉంది. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా, ప్రయాణికులకు

News

టాటా మోటార్స్ షేర్లు 5% కుప్పకూలాయి; UBS 20% తగ్గుదల అవకాశాన్ని చూసింది

సెప్టెంబర్ 11న ప్రారంభ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్లు దాదాపు 5 శాతం పడిపోయి, నిఫ్టీ 50లో అత్యధిక నష్టాల్లో ఒకటిగా నిలిచాయి. ఉదయం 09.52 గంటలకు టాటా మోటార్స్ షేర్లు NSEలో రూ.

News

ఆథర్ ఎనర్జీ IPOకి సిద్ధం, రూ. 3,100 కోట్ల తాజా షేర్ల విడుదలతో సహా

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఆథర్ ఎనర్జీ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ ఐపీఓలో రూ. 3,100 కోట్ల విలువైన తాజా