Petrol, Diesel price Today: స్థిరంగానే కొనసాగుతున్న పెట్రో ధరలు.. కొన్ని చోట్ల పెరిగిన రేట్లు.. ప్రధాన నగరాల్లో..

News

Petrol, Diesel Rates Today: చమురు ధరలకు కొన్ని రోజులనుంచి బ్రేక్ పడుతూ వస్తోంది. దీంతో సామాన్యులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. ఇటీవల పెట్రోల్,

Petrol, Diesel Rates Today: చమురు ధరలకు కొన్ని రోజులనుంచి బ్రేక్ పడుతూ వస్తోంది. దీంతో సామాన్యులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం పెరిగిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు తల్లడిల్లారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో అందరినుంచి ఆందోళన వక్తమైంది. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ కూడా దాటింది. ప్రస్తుతం కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. అన్నిచోట్ల ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.51 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.83 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిన్న పెట్రోల్‌ ధర రూ.94.13 ఉండగా.. సోమవారం స్వల్పంగా తగ్గింది. 93.99 కి చేరింది. డీజిల్‌ ధర రూ.88.05 కి చేరింది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.12 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.15గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.52 గా ఉంది. డీజిల్‌ ధర రూ.90.04 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 96.01 ఉండగా.. డీజిల్‌ ధర రూ.89.52 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.69 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.22గా ఉంది.

Related Posts

News

ఆదాని పోర్ట్స్ షేర్లు మార్చిలో నెలవారీ కార్గో వాల్యూమ్స్ తమ గరిష్ఠానికి చేరుకోవడంతో రికార్డ్ స్థాయికి ఎగసింది

ఆదాని పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకానమిక్ జోన్ లిమిటెడ్ యొక్క షేర్లు సోమవారం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి, మార్చి 2024లో దాని అత్యధిక నెలవారీ కార్గో వాల్యూమ్స్ 38 మిలియన్ మెట్రిక్ టన్నుల పైన

News

వ్యాపార ఆలోచన: జ్యూస్ వ్యాపారంతో ఒక నెల లో.. రూ.1.5 లక్షల ఆదాయం..!

జ్యూస్ వ్యాపారం ఒక కొన్ని ప్రారంభిక ఖచ్చితంగా ఆర్థిక అవకాశం ఉంటుంది. ఇది సులభంగా ప్రారంభించబడినప్పుడు, మరియు కొన్ని ఉపయోగకరమైన సమాచారాన్ని పొందగలరు.
ఆహారం మరియు పోషకాల ప్రాధాన్యత తెలుసుకోవడం అనేకంగా మానవులకు తెలుసు. ఆదివారం

News

LPG Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హోలీకి ముందు సామాన్య ప్రజలకు పెట్రోలియం సంస్థలు గట్టి షాకిచ్చాయి. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ.

News

యాప్ స్టోర్, Nfc, iMessage: కొత్త యూరోపియన్ నియమాల కారణంగా తదుపరి ఐఫోన్ ఎలా మారుతుందో ఇక్కడ ఉంది

డిజిటల్ మార్కెట్ల చట్టం 2023లో అమల్లోకి వస్తుంది మరియు వచ్చే ఏడాది పూర్తిగా అమలులోకి వస్తుంది. EU దేశాల్లో, ఈ రోజు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు సేవలపై అనేక ఆంక్షలను తొలగించాల్సిందిగా Appleని ఒత్తిడి