Pension Scheme: ఇకపై వారికి ఆ పెన్షన్ పధకం వర్తించదు.. అమలులోకి న్యూ రూల్స్.!

News

తాజాగా ఈ పెన్షన్ పధకాల్లో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. అర్హులైనవారికి మాత్రమే..

కేంద్రం పలు పెన్షన్ పధకాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్, అటల్ పెన్షన్ యోజన పధకాలు ముఖ్యమైనవి. అసంఘటిత కార్మికుల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు తమ పధకాలు చేరాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు పలు పధకాలను ప్రవేశపెట్టింది. అయితే తాజాగా ఈ పెన్షన్ పధకాల్లో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. అర్హులైనవారికి మాత్రమే పధకాల ప్రయోజనాలు అందేలా కొన్ని నియమ నిబంధనలను మార్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా అటల్ పెన్షన్ యోజన పధకానికి సంబంధించిన రూల్స్ మారాయి. ఇకపై ఈ స్కీంలో చేరేందుకు అందరూ అర్హులు కాదు. ఈ పధకంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు చేరకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

ఎవరైతే అటల్ పెన్షన్ యోజన పధకంలో లబ్దిదారుడిగా ఉండి.. ఆ తర్వాత ఆదాయపు పన్ను చెల్లింపుదారుడిగా మారితే.. వారికి ఇకపై ఈ స్కీం వర్తించదు. అప్పటివరకు జమ చేసిన మొత్తాన్ని కేంద్రం తిరిగి ఇచ్చేయనుంది. ఈ రూల్స్ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.

వాస్తవానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఆగస్ట్ 10, 2022 నాటి నోటిఫికేషన్‌లో, ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు లేదా పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన కింద తమ ఖాతాను తెరవలేరని పేర్కొంది. కాగా, అటల్ పెన్షన్ యోజన పధకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015వ సంవత్సరం మే 9వ తేదీన ప్రారంభించింది. ఈ పెన్షన్ పధకంలో డబ్బులు జమ చేసే లబ్దిదారులకు 60 ఏళ్లు దాటిన తర్వాత రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్ లభిస్తుంది. ఇది కూడా మీరు జమ చేసిన డబ్బు మొత్తంపై ఆధారపడి ఉంటుంది.

Related Posts

News

వారానికి 6 రోజులు పని చేయాలా? 5 రోజులు చాలు!

నేటి వేగంగా మారుతున్న జీవన విధానంలో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువసేపు పనిచేయడం వల్ల వారు కుటుంబంతో గడిపే సమయం తగ్గి, మానసిక, శారీరక ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ నష్టం కలిగించే

News

సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌: రైల్వే షాకింగ్ నిర్ణయం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు భారతీయ రైల్వేలోకి ప్రవేశించిన తర్వాత ప్యాసింజర్ల నుండి మంచి స్పందన లభించింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ రైళ్లకు విశేష డిమాండ్ ఉంది. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా, ప్రయాణికులకు

News

టాటా మోటార్స్ షేర్లు 5% కుప్పకూలాయి; UBS 20% తగ్గుదల అవకాశాన్ని చూసింది

సెప్టెంబర్ 11న ప్రారంభ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్లు దాదాపు 5 శాతం పడిపోయి, నిఫ్టీ 50లో అత్యధిక నష్టాల్లో ఒకటిగా నిలిచాయి. ఉదయం 09.52 గంటలకు టాటా మోటార్స్ షేర్లు NSEలో రూ.

News

ఆథర్ ఎనర్జీ IPOకి సిద్ధం, రూ. 3,100 కోట్ల తాజా షేర్ల విడుదలతో సహా

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఆథర్ ఎనర్జీ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ ఐపీఓలో రూ. 3,100 కోట్ల విలువైన తాజా