Pension Scheme: ఇకపై వారికి ఆ పెన్షన్ పధకం వర్తించదు.. అమలులోకి న్యూ రూల్స్.!

News

తాజాగా ఈ పెన్షన్ పధకాల్లో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. అర్హులైనవారికి మాత్రమే..

కేంద్రం పలు పెన్షన్ పధకాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్, అటల్ పెన్షన్ యోజన పధకాలు ముఖ్యమైనవి. అసంఘటిత కార్మికుల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు తమ పధకాలు చేరాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు పలు పధకాలను ప్రవేశపెట్టింది. అయితే తాజాగా ఈ పెన్షన్ పధకాల్లో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. అర్హులైనవారికి మాత్రమే పధకాల ప్రయోజనాలు అందేలా కొన్ని నియమ నిబంధనలను మార్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా అటల్ పెన్షన్ యోజన పధకానికి సంబంధించిన రూల్స్ మారాయి. ఇకపై ఈ స్కీంలో చేరేందుకు అందరూ అర్హులు కాదు. ఈ పధకంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు చేరకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

ఎవరైతే అటల్ పెన్షన్ యోజన పధకంలో లబ్దిదారుడిగా ఉండి.. ఆ తర్వాత ఆదాయపు పన్ను చెల్లింపుదారుడిగా మారితే.. వారికి ఇకపై ఈ స్కీం వర్తించదు. అప్పటివరకు జమ చేసిన మొత్తాన్ని కేంద్రం తిరిగి ఇచ్చేయనుంది. ఈ రూల్స్ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.

వాస్తవానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఆగస్ట్ 10, 2022 నాటి నోటిఫికేషన్‌లో, ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు లేదా పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన కింద తమ ఖాతాను తెరవలేరని పేర్కొంది. కాగా, అటల్ పెన్షన్ యోజన పధకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015వ సంవత్సరం మే 9వ తేదీన ప్రారంభించింది. ఈ పెన్షన్ పధకంలో డబ్బులు జమ చేసే లబ్దిదారులకు 60 ఏళ్లు దాటిన తర్వాత రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్ లభిస్తుంది. ఇది కూడా మీరు జమ చేసిన డబ్బు మొత్తంపై ఆధారపడి ఉంటుంది.

Related Posts

News

హోమ్ సెక్యూరిటీ కెమెరా ప్రొఫెషనల్ మార్కెట్ 2024 మేరకు USD బిలియన్ | CAGR వద్ద పెరుగుతోంది | అంతర్దృష్టులు మరియు సూచన

“””హోమ్ సెక్యూరిటీ కెమెరా ప్రొఫెషనల్”” మార్కెట్ 2024 డెవలప్మెంట్ స్ట్రాటజీ ప్రీ అండ్ పోస్ట్ కోవిడ్-19, కార్పొరేట్ వ్యూహం, రకం, అప్లికేషన్ మరియు 20 ప్రముఖ దేశాల విశ్లేషణ ద్వారా. నివేదిక నిర్దిష్ట మరియు

News

స్విచింగ్ వాల్వ్స్ ప్రొఫెషనల్ మార్కెట్ 2024 మేరకు USD బిలియన్ | CAGR వద్ద పెరుగుతోంది | అంతర్దృష్టులు మరియు సూచన

“””స్విచింగ్ వాల్వ్స్ ప్రొఫెషనల్”” మార్కెట్ 2024 డెవలప్మెంట్ స్ట్రాటజీ ప్రీ అండ్ పోస్ట్ కోవిడ్-19, కార్పొరేట్ వ్యూహం, రకం, అప్లికేషన్ మరియు 20 ప్రముఖ దేశాల విశ్లేషణ ద్వారా. నివేదిక నిర్దిష్ట మరియు విశ్వసనీయ

News

Hba1c ఎనలైజర్ ప్రొఫెషనల్ మార్కెట్ 2024 మేరకు USD బిలియన్ | CAGR వద్ద పెరుగుతోంది | అంతర్దృష్టులు మరియు సూచన

“””Hba1c ఎనలైజర్ ప్రొఫెషనల్”” మార్కెట్ 2024 డెవలప్మెంట్ స్ట్రాటజీ ప్రీ అండ్ పోస్ట్ కోవిడ్-19, కార్పొరేట్ వ్యూహం, రకం, అప్లికేషన్ మరియు 20 ప్రముఖ దేశాల విశ్లేషణ ద్వారా. నివేదిక నిర్దిష్ట మరియు విశ్వసనీయ

News

రుచులు & సువాసనలు ప్రొఫెషనల్ మార్కెట్ 2024 మేరకు USD బిలియన్ | CAGR వద్ద పెరుగుతోంది | అంతర్దృష్టులు మరియు సూచన

“””రుచులు & సువాసనలు ప్రొఫెషనల్”” మార్కెట్ 2024 డెవలప్మెంట్ స్ట్రాటజీ ప్రీ అండ్ పోస్ట్ కోవిడ్-19, కార్పొరేట్ వ్యూహం, రకం, అప్లికేషన్ మరియు 20 ప్రముఖ దేశాల విశ్లేషణ ద్వారా. నివేదిక నిర్దిష్ట మరియు