Indian Railway: వేరొకరి టికెట్‌పై రైల్లో ప్రయాణించవచ్చు.. ఎలాగో తెలుసా..

News

రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు ప్రయాణం చేయవచ్చు. మీకు టికెట్ బుక్ కాకపోయినా.. ఈ సౌకర్యంతో.. మీరు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారా.? అయితే మీకో ముఖ్య గమనిక. రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు ప్రయాణం చేయవచ్చు. మీకు టికెట్ బుక్ కాకపోయినా.. ఈ సౌకర్యంతో ఈజీగా ప్రయాణం చేసేయొచ్చు. మరి అదెలాగో తెలుసుకుందాం..

ఇండియన్ రైల్వేస్ తాజాగా ఓ నిబంధన అమలులోకి తీసుకొచ్చింది. మీ కుటుంబం సభ్యుల టికెట్‌పై ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది. అయితే మీరు ఎవరి టికెట్‌పై ప్రయాణించాలని అనుకుంటున్నారో.. వారు మీకు రక్త సంబంధీకులై ఉండాలి. ఉదాహరణకు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరిట టికెట్ ఉంటే మీరు వారి టికెట్‌పై సులభంగా ప్రయాణించవచ్చు. అయితే దీనికంటూ ఓ ప్రక్రియ ఉంది.

మొదట ప్రయాణించాల్సిన వ్యక్తి పేరు బదులుగా.. ఎవరైతే ఆ టికెట్‌పై ప్రయాణించాలనుకుంటున్నారో.. అతడి పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ట్రైన్ బయల్దేరే 24 గంటల ముందుగా మీరు సంబంధిత రైల్వే అధికారులకు అవసరమైన డాక్యుమెంట్స్‌తో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని అధికారులు పరిశీలించి.. ఆ తర్వాత టికెట్‌పై ప్రయాణించాల్సిన సభ్యుడి పేరును ఉంచుతారు.

అలాగే విద్యాసంస్థల విద్యార్థులకు టికెట్ బదిలీ సౌకర్యాన్ని కూడా భారతీయ రైల్వే అందిస్తోంది. అటువంటి పరిస్థితిలో బయలుదేరడానికి 48 గంటల ముందు అవసరమైన పత్రాలతో లెటర్‌హెడ్‌పై ఇనిస్టిట్యూట్ హెడ్ రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే.. దాన్ని రైల్వే అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తారు. పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లేవారికి రైలు టికెట్ల కన్ఫర్మేషన్‌ పెద్ద సమస్యగా మారుతోంది. 2-3 నెలల ముందే టికెట్ తీసుకున్నా వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండటం జరుగుతోంది. అయితే ఈ సమస్యను వికల్ప్ పధకం ద్వారా పరిష్కరించవచ్చు.

Related Posts

News

వారానికి 6 రోజులు పని చేయాలా? 5 రోజులు చాలు!

నేటి వేగంగా మారుతున్న జీవన విధానంలో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువసేపు పనిచేయడం వల్ల వారు కుటుంబంతో గడిపే సమయం తగ్గి, మానసిక, శారీరక ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ నష్టం కలిగించే

News

సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌: రైల్వే షాకింగ్ నిర్ణయం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు భారతీయ రైల్వేలోకి ప్రవేశించిన తర్వాత ప్యాసింజర్ల నుండి మంచి స్పందన లభించింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ రైళ్లకు విశేష డిమాండ్ ఉంది. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా, ప్రయాణికులకు

News

టాటా మోటార్స్ షేర్లు 5% కుప్పకూలాయి; UBS 20% తగ్గుదల అవకాశాన్ని చూసింది

సెప్టెంబర్ 11న ప్రారంభ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్లు దాదాపు 5 శాతం పడిపోయి, నిఫ్టీ 50లో అత్యధిక నష్టాల్లో ఒకటిగా నిలిచాయి. ఉదయం 09.52 గంటలకు టాటా మోటార్స్ షేర్లు NSEలో రూ.

News

ఆథర్ ఎనర్జీ IPOకి సిద్ధం, రూ. 3,100 కోట్ల తాజా షేర్ల విడుదలతో సహా

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఆథర్ ఎనర్జీ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ ఐపీఓలో రూ. 3,100 కోట్ల విలువైన తాజా