ఫోర్బ్స్ ధనవంతుల జాబితా 2021: ప్రతీ 17 గంటలకు పుట్టుకొచ్చిన ఒక కొత్త బిలియనీర్.. ప్రపంచంలో ఎక్కువ మంది కోటీశ్వరులున్నది బీజింగ్‌లోనే..

News

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజీన్ ఇటీవల విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం.. ఎలాన్ మస్క్ అదే వేగంతో ముందుకు దూసుకుపోతున్నారని, కొత్తగా కిమ్ కర్డాషియన్ వెస్ట్ కోటీశ్వరుల జాబితాలో చేరారని ఫోర్బ్స్ పేర్కొంది. “ఓపక్క మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ, ప్రపంచ ధనవంతుల సంపద రికార్డ్ స్థాయిలో 5 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. అంతేకాకుండా మునుపెన్నడూ లేనంతమంది కొత్త కోటీశ్వరులు ఈ జాబితాలో చేరారు” అని ఈ ప్రోజెక్ట్ నిర్వహించిన ఫోర్బ్స్ ఎడిటర్ కెర్రీ ఎ. డోలన్ తెలిపారు. 2021 ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో మొత్తం 2,755మంది ఉన్నారు. ఈ జాబితాలోని ముఖ్యంశాలు ఇవి.

2021లో 1 బిలియన్ (100 కోట్లు) డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ సంపదతో ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో చేరిన సంఖ్య 2,755. అంతకుముందు సంవత్సరం కంటే ఈసారి 600 మంది పెరిగారు. వారంతా కూడా 13.1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల సంపద కూడబెట్టారని అంచనా. 2020లో ఈ సంఖ్య 8 ట్రిలియన్ యూఎస్ డాలర్లు. కరోనావైరస్ సంక్షోభం ఉన్నప్పటికీ వీరిలో 86శాతం మంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నారు. 2021 ధనవంతుల జాబితాలో 493 కొత్త పేర్లు చేరాయని ఫోర్బ్స్ తెలిపింది. అంటే ప్రతి 17 గంటలకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొచ్చారని పేర్కొంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరిలో 210 చైనీయులు కాగా, 98 మంది అమెరికన్లు.

తాజా ఫోర్బ్స్ ధనవంతుల జాబితా ప్రకారం ఇప్పుడు ప్రపంచంలో ఏ నగరంలో లేనంత ఎక్కువ మంది కోటీశ్వరులు బీజింగ్‌లో ఉన్నారు. గత ఏడాది బీజింగ్‌ నుంచి 33 మంది కోటీశ్వరులు ఈ జాబితాలో చేరగా ఈ ఏడాది 100మంది చోటు దక్కించుకున్నారని ఫోర్బ్స్ మ్యాగజీన్ తెలిపింది. గత ఏడేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న న్యూయార్క్ సిటీని కూడా బీజింగ్ ఈసారి వెనక్కి నెట్టేసింది. న్యూయార్క్ సిటీ నుంచి 99 మంది ఈ ధనవంతుల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

కోవిడ్-19తో సత్వర పోరాటం, సాంకేతిక సంస్థలు, స్టాక్ మార్కెట్ల ఎదుగుదల కారణంగా చైనాలో ధనవంతుల సంఖ్య పెరిగింది. అయితే, న్యూయార్క్ సిటీ కన్నా ఎక్కువమంది ధనవంతులు బీజింగ్‌లో ఉన్నప్పటికీ ఉమ్మడి నికర విలువలో (80 బిలియన్ యూఎస్ డాలర్లు) న్యూయార్క్ సిటీలోని ధనవంతులదే పైచేయిగా ఉంది. టిక్‌టాక్ వ్యవస్థాపకులు, దాని మాతృ సంస్థ బైట్‌డాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాంగ్ యిమింగ్ ప్రస్తుతం బీజింగ్ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. జాంగ్ యిమింగ్ నికర ఆస్తి విలువ రెట్టింపు అయి 35.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. న్యూయార్క్‌లో అత్యంత ధనవంతుడిగా మాజీ మేయర్ మైఖేల్ బ్లూంబర్గ్ నిలిచారు. ఆయన 59 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు.

Related Posts

Affordable Health Insurance Business Car Insurance Health Insurance News

జెట్ స్కిస్ మార్కెట్ సైజు, షేర్, గ్రోత్ అనాలిసిస్ 2034

జెట్ స్కిస్ మార్కెట్ పరిశోధన నివేదిక 2025 – [74 పేజీల నివేదిక మరియు 103 గణాంకాలు, పట్టికలు మరియు చార్ట్‌ల జాబితా]

“”జెట్ స్కిస్ మార్కెట్”” 2034 నాటికి గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది,

Affordable Health Insurance Business Car Insurance Health Insurance News

విట్రస్ కార్బన్ మార్కెట్ పరిమాణం, పరిశ్రమ వాటా | సూచన, 2034

విట్రస్ కార్బన్ మార్కెట్ పరిశోధన నివేదిక 2025 – [96 పేజీల నివేదిక మరియు 116 గణాంకాలు, పట్టికలు మరియు చార్ట్‌ల జాబితా]

“”విట్రస్ కార్బన్ మార్కెట్”” 2034 నాటికి గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది,

Affordable Health Insurance Business Car Insurance Health Insurance News

వినైల్ వాల్‌పేపర్ మార్కెట్ పరిమాణం, ట్రెండ్‌లు, షేర్ 2034

వినైల్ వాల్‌పేపర్ మార్కెట్ పరిశోధన నివేదిక 2025 – [126 పేజీల నివేదిక మరియు 150 గణాంకాలు, పట్టికలు మరియు చార్ట్‌ల జాబితా]

“”వినైల్ వాల్‌పేపర్ మార్కెట్”” 2034 నాటికి గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది,

Affordable Health Insurance Business Car Insurance Health Insurance News

లైంగిక సంరక్షణ మార్కెట్ పరిమాణం, షేర్ & గ్లోబల్ అనాలిసిస్ రిపోర్ట్ – 2034

లైంగిక ఆరోగ్యం మార్కెట్ పరిశోధన నివేదిక 2025 – [127 పేజీల నివేదిక మరియు 158 గణాంకాలు, పట్టికలు మరియు చార్ట్‌ల జాబితా]

“”లైంగిక ఆరోగ్యం మార్కెట్”” 2034 నాటికి గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది,