ఆత్మనిర్భర్ భారత్: మోదీ చెప్పిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌ ఏమయింది, నిధులు ఎవరికి చేరాయి? – prajaavani.com

News

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాలలో స్వల్ప మెరుగుదల కనిపించింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి, సుమారు 8శాతం క్షీణతను అంచనా వేయగా, ఇది 7.3 శాతం దగ్గర ఆగిపోయింది. అదే సమయంలో నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటును 1.3 శాతంగా అంచనా వేయగా, అది 1.6 శాతం నమోదైంది. కానీ, ఈ గణాంకాల ఆధారంగా ఎకానమీ కోలుకుని, పరుగులు పెట్టే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఏ స్థితిలో ఉంది, దానికి ఎలాంటి చికిత్స కావాలనేది అంచనా వేయడానికి నాలుగు కొలమానాలు ఉన్నాయి. ఒకటి జీడీపీ, రెండోది నిరుద్యోగిత రేటు, మూడోది ద్రవ్యోల్బణం, నాలుగోది ప్రజలు ఖర్చు చేసే సామర్ధ్యం.

ఈ నాలుగు కొలమానాల ఆధారంగా చూసినప్పుడు గత ఏడాదికీ, ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలో పెద్దగా మార్పు లేదు. ఎకానమీకి చికిత్స చేసేందుకు మోదీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది కానీ, విజయవంతం కాలేదు. కాబట్టి పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. కరోనా మొదటి వేవ్‌లో భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి మోదీ ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.

సోమవారం విడుదలైన ఆర్థిక శాఖ గణాంకాలు జనవరి నుంచి మార్చి మధ్య కాలం నాటివి. కరోనా ప్రభావం పోయిందని ప్రజలు నిర్భయంగా రోడ్ల మీదకు వస్తున్న సమయం అది. కరోనాను పారదోలామని ప్రభుత్వం అప్పటికే ప్రకటనలు చేసింది. అన్ని ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు ఎత్తివేశారు. అలాంటి పరిస్థితుల్లో, మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు ఇచ్చిన రూ.20 లక్షల కోట్ల మెగా బూస్టర్ వ్యాక్సీన్ ప్రభావం ఎంత అన్న ప్రశ్న వచ్చినప్పుడు పెద్దగా లేదు అన్న సమాధానం వస్తుంది. మరి ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజ్ ఏమయింది…ఆ నిధులు ఎటు వెళ్లాయి, ప్రభుత్వం తాను ప్రకటించినట్లు ఖర్చు చేయగలిగిందా? చేస్తే వాటి ప్రభావం ఎంత?

Related Posts

News

వారానికి 6 రోజులు పని చేయాలా? 5 రోజులు చాలు!

నేటి వేగంగా మారుతున్న జీవన విధానంలో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువసేపు పనిచేయడం వల్ల వారు కుటుంబంతో గడిపే సమయం తగ్గి, మానసిక, శారీరక ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ నష్టం కలిగించే

News

సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌: రైల్వే షాకింగ్ నిర్ణయం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు భారతీయ రైల్వేలోకి ప్రవేశించిన తర్వాత ప్యాసింజర్ల నుండి మంచి స్పందన లభించింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ రైళ్లకు విశేష డిమాండ్ ఉంది. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా, ప్రయాణికులకు

News

టాటా మోటార్స్ షేర్లు 5% కుప్పకూలాయి; UBS 20% తగ్గుదల అవకాశాన్ని చూసింది

సెప్టెంబర్ 11న ప్రారంభ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్లు దాదాపు 5 శాతం పడిపోయి, నిఫ్టీ 50లో అత్యధిక నష్టాల్లో ఒకటిగా నిలిచాయి. ఉదయం 09.52 గంటలకు టాటా మోటార్స్ షేర్లు NSEలో రూ.

News

ఆథర్ ఎనర్జీ IPOకి సిద్ధం, రూ. 3,100 కోట్ల తాజా షేర్ల విడుదలతో సహా

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఆథర్ ఎనర్జీ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ ఐపీఓలో రూ. 3,100 కోట్ల విలువైన తాజా