SBI : ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్, వడ్డీ రేట్లు తగ్గింపు.. అమల్లోకి కొత్త రూల్స్
నవంబర్ నెల ముగిసింది. కొత్త నెల డిసెంబర్ లోకి ఎంటర్ అయిపోయాం. అదే సమయంలో కొత్త రూల్స్ కూడా అమల్లోకి వచ్చేశాయి. డిసెంబర్ 1 నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. ఈ కారణంగా సామాన్యులపై..
SBI : నవంబర్ నెల ముగిసింది. కొత్త నెల డిసెంబర్ లోకి ఎంటర్ అయిపోయాం. అదే సమయంలో కొత్త రూల్స్ కూడా అమల్లోకి వచ్చేశాయి. డిసెంబర్ 1 నుంచి పలు అంశాలు మారాయి. ఈ కారణంగా సామాన్యులపై కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇంతకీ ఏయే అంశాలు ఇవాళ్టి నుంచి మారాయి, ఎలాంటి ప్రభావం పడనుంది..
ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు ఝలక్..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన క్రెడిట్ కార్డు యూజర్లకు షాకిచ్చింది. డిసెంబర్ 1 నుంచి అంటే ఈరోజు నుంచి ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయనుంది. రూ.99తో పాటు ఇతర పన్నులు చెల్లించాలి. ఈఎంఐ ద్వారా జరిపే కొనుగోళ్లకు అదనపు ఛార్జీ చెల్లించాలి. ఈఎంఐ కొనుగోళ్లపై రూ.99 + ట్యాక్సులు చెల్లించాలి. అంటే ఆన్లైన్ షాపింగ్‌తో పాటు మర్చంట్స్ దగ్గర ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయి.
సేవింగ్స్ ఖాతాదారులకు పీఎన్బీ బ్యాడ్ న్యూస్..
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB కీలక నిర్ణయం తీసుకుంది. సేవింగ్స్ ఖాతాదారులకు ఝలక్ ఇచ్చింది. వడ్డీ రేట్లను సవరించింది. సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో వడ్డీ రేటు ఇప్పుడు 2.8 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఇదివరకు 2.90 వార్షిక వడ్డీ ఇచ్చేది, ఇక నుంచి 2.80 శాతం వడ్డీ వర్తిస్తుంది. సేవింగ్స్ అకౌంట్లో రూ.10,00,000 లోపు ఉన్నవారికి 2.80 శాతం వడ్డీ, రూ.10,00,000 కన్నా ఎక్కువ ఉంటే 2.85 శాతం వడ్డీ లభిస్తుంది.
14ఏళ్ల తర్వాత… పెరిగిన అగ్గిపెట్టె ధర..
అగ్గిపెట్టెల ధర కూడా పెరిగింది. ఈరోజు నుంచి ధర పెంపు అమల్లోకి వచ్చింది. 14 ఏళ్ల తర్వాత మ్యాచ్ బాక్స్ ధర పెరగడం గమనార్హం. ఇప్పుడు అగ్గి పెట్టె కొనాలంటే రూ.2 కావాలి. ఇది వరకు దీని ధర రూ.1. అయితే ఇప్పుడు అగ్గిపెట్టెలో 50 పుల్లలు ఉంటాయి. ఇది వరకు 36 ఉండేవి. ముడిసరుకు, తయారీ ఖర్చు పెరగడమే అగ్గిపెట్టె ధర పెరగడానికి కారణం.