PMEGP పథకం: 35% సబ్సిడీతో రూ.25 లక్షల వరకు రుణాలు – కేంద్రం నుండి కొత్త వ్యాపార ప్రారంభానికి పెద్ద పుష్కరం

Business

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత, చేతివృత్తి కార్మికులు వంటి వారికి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద తయారీ, సేవల రంగాలలో మద్యం రూ.5 లక్షల నుండి రూ.25 లక్షల వరకు రుణాలు, 15-35% సబ్సిడీతో అందిస్తున్నాయి. స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే వారికి ఇది పెద్ద అవకాశం.

ఈ పథకంలో కేవీఐసీ (ఖాదీ & గ్రామీణ పరిశ్రమలు కమిషన్) ప్రధాన నోడల్ ఏజెన్సీగా పని చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో కేవీఐసీ, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్, బ్యాంకులు కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే రాయితీతో బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు అవుతాయి.

అర్హతలు

ఈ పథకంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ అర్హులు. స్వయం ఉపాధి ప్రాజెక్టుల కింద కనీసం 8వ తరగతి పాస్ అయిన వారు మాత్రమే అర్హత సాధిస్తారు. ప్రాజెక్ట్ విలువ తయారీ రంగంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ, సేవల రంగంలో రూ.5 లక్షలకు మించి ఉండాలి. స్వయం సహాయక బృందాలు, రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన సంస్థలు, ఉత్పత్తి ఆధారిత సహకార సంఘాలు కూడా ఈ పథకానికి అర్హులు.

రుణ సౌకర్యాలు

ప్రాజెక్ట్ లేదా యూనిట్ తయారీ రంగంలో గరిష్టంగా రూ.25 లక్షలు, బిజినెస్ రంగంలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. పట్టణ ప్రాంతాలలో సాధారణ కేటగిరీ లబ్ధిదారులకు 15%, గ్రామీణ ప్రాంతాల్లో 25% సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి ఇతర కేటగిరీ వారికి పట్టణ ప్రాంతాల్లో 25%, గ్రామీణ ప్రాంతాల్లో 35% సబ్సిడీని బ్యాంకుల ద్వారా రుణం రూపంలో అందిస్తారు.

PMEGP దరఖాస్తు విధానం

PMEGP లోన్ కోసం అర్హత నిర్ధారణ, ప్రాథమిక వివరాల నమోదు, ప్రాజెక్ట్ ఖర్చు అంచనా తదితర ప్రక్రియలు ఈ విధంగా ఉంటాయి:

  1. అర్హత ధృవీకరణ: జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా మీ అర్హతను ముందుగా నిర్ధారించుకోండి.
  2. ప్రాజెక్ట్ ఖర్చు అంచనా: మొత్తం ఖర్చును, సహాకారం పొందదగిన మొత్తాన్ని ముందుగానే నిర్ణయించుకోండి.
  3. ఆన్‌లైన్ దరఖాస్తు: ప్రభుత్వ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసి, వ్యక్తిగత, వ్యాపార వివరాలు నమోదు చేయాలి.
  4. శిక్షణ: లోన్ మంజూరైన తరువాత, ఎంటర్‌ప్రెన్యూరియల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (EDP) శిక్షణలో పాల్గొనాలి.
  5. ప్రాజెక్ట్, బ్యాంక్ వివరాలు నమోదు: మీ దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

Related Posts

Business

గృహ ప్రణాళికలు మార్కెట్ పరిమాణం, వాటా, వృద్ధి, ప్రాంతీయ పోకడలు, అవకాశ అంచనా మరియు 2024-2032 వరకు సమగ్ర పరిశోధన అధ్యయనం

గ్లోబల్ గృహ ప్రణాళికలు మార్కెట్ పరిమాణం & వృద్ధి అంచనాలు [2024-2032] –
కీవర్డ్ మార్కెట్ పరిమాణం – మార్కెట్ డైనమిక్స్, పోటీ ప్రకృతి దృశ్యాలు మరియు ప్రాంతీయ వృద్ధి పథాల యొక్క లోతైన విశ్లేషణను

Business

స్లిమ్‌లైన్ లిథియం బ్యాటరీ మార్కెట్ ఫ్యూచర్ గ్రోత్, స్థూల మార్జిన్, రాబడి, టాప్ కీ-ప్లేయర్స్, ఇండస్ట్రీ విశ్లేషణ, 2032 వరకు వ్యాపార వ్యూహ సూచన

గ్లోబల్ స్లిమ్‌లైన్ లిథియం బ్యాటరీ మార్కెట్ పరిమాణం & వృద్ధి అంచనాలు [2024-2032] –
కీవర్డ్ మార్కెట్ పరిమాణం – మార్కెట్ డైనమిక్స్, పోటీ ప్రకృతి దృశ్యాలు మరియు ప్రాంతీయ వృద్ధి పథాల యొక్క దృఢమైన

Business

గాలియం సెలెనైడ్ (GaSe) స్ఫటికాలు మార్కెట్ పరిమాణం, షేర్, 2024 గ్లోబల్ ఇండస్ట్రీ డిమాండ్, వ్యాపార అవకాశాలు, ట్రెండ్‌లు, టాప్ ప్లేయర్‌లు, 2032 నాటికి భవిష్యత్తు వృద్ధి

గ్లోబల్ గాలియం సెలెనైడ్ (GaSe) స్ఫటికాలు మార్కెట్ పరిమాణం & వృద్ధి అంచనాలు [2024-2032] –
కీవర్డ్ మార్కెట్ పరిమాణం – మార్కెట్ డైనమిక్స్, పోటీ ప్రకృతి దృశ్యాలు మరియు ప్రాంతీయ వృద్ధి పథాల యొక్క

Business

రాఫినో-ఒలిగోసాకరైడ్ (ROS) ఇండస్ట్రీ 2024 గ్లోబల్ మార్కెట్ గ్రోత్, ట్రెండ్స్, రెవెన్యూ, షేర్ అండ్ డిమాండ్స్ రీసెర్చ్ రిపోర్ట్

గ్లోబల్ రాఫినో-ఒలిగోసాకరైడ్ (ROS) మార్కెట్ పరిమాణం & వృద్ధి అంచనాలు [2024-2032] –
కీవర్డ్ మార్కెట్ పరిమాణం – మార్కెట్ డైనమిక్స్, పోటీ ప్రకృతి దృశ్యాలు మరియు ప్రాంతీయ వృద్ధి ధోరణుల యొక్క వివరణాత్మక విశ్లేషణను