షేర్ బైబ్యాక్‌తో అదిరిపోయే సంపాదన.. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

Business

ప్రస్తుత కాలంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తిచూపుతున్నారు. ఆర్థికంగా బలపడేందుకు స్టాక్ మార్కెట్‌లో షేర్లను కొనుగోలుచేస్తుంటారు.

ప్రస్తుత కాలంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తిచూపుతున్నారు. ఆర్థికంగా బలపడేందుకు స్టాక్ మార్కెట్‌లో షేర్లను కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం.. షేర్‌లలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో షేర్‌ బైబ్యాక్‌ అనే విషయంపై చాలామందికి అవగాహన ఉండదు. ఒక వేళ మీరు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టినట్లయితే, ఖచ్చితంగా బైబ్యాక్ అనే పదాన్ని చూడటం, లేదా విని ఉంటారు. మీరు వాటి నుంచి రాబడిని ఎలా పొందవచ్చన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి పూర్తిగా అర్ధం కాకపోతే బైబ్యాక్.. అంటే ఏంటీ..? బైబ్యాక్‌ ఎలా కొనుగులు చేస్తారు..? ఎలా విక్రయిస్తారు.. మొత్తం వివరాలను తెలుసుకోండి..

బైబ్యాక్: బైబ్యాక్‌లు IPO కార్యకలాపాలకి వ్యతిరేకంగా జరుగుతాయి. IPOలో కంపెనీ షేర్లను ప్రజలకు జారీ చేస్తుంది. అయితే బైబ్యాక్‌లో కంపెనీ ఇప్పటికే ఉన్న వాటాదారుల నుంచి దాని షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. కంపెనీ తన షేర్లను మార్కెట్లోని ఇతర షేర్‌హోల్డర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయడాన్ని షేర్ల బైబ్యాక్‌గా పేర్కొంటారు. దీనివల్ల ఓపెన్ మార్కెట్లో షేర్ల సంఖ్య తగ్గుతుంది.

బైబ్యాక్ రకాలు: కంపెనీ బైబ్యాక్ షేర్లు రెండు రకాలుగా సాధారణ పద్దతుల్లో ఉంటాయి. ఒకటి టెండర్ ఆఫర్, రెండవది ఓపెన్ మార్కెట్.. టెండర్ ఆఫర్‌లో కంపెనీ తన షేర్లను ప్రస్తుత వాటాదారుల నుంచి ఒక నిర్దిష్ట కాలపరిమితిలో దామాషా ప్రాతిపదికన స్థిర ధరకు తిరిగి కొనుగోలు చేస్తుంది. ఓపెన్ మార్కెట్ నుంచి షేర్ల బైబ్యాక్ విషయంలో.. ఆర్డర్ మ్యాచింగ్ మెకానిజం ద్వారా దేశవ్యాప్తంగా ట్రేడింగ్ టెర్మినల్స్ ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీ షేర్లను బైబ్యాక్ చేస్తుంది.

బైబ్యాక్ ఆఫర్ ప్రైస్: టెండర్ ఆఫర్ మార్గంలో ఇప్పటికే ఉన్న వాటాదారుల నుంచి కంపెనీ తన షేర్లను బైబ్యాక్ చేయడానికి సిద్ధంగా ఉన్న ధర.. దీనినే ఆఫర్ ప్రైస్ అంటారు. కంపెనీ వాటాదారులకు ఆఫర్‌ను ప్రకటిస్తుంది. బైబ్యాక్ షేర్‌లను ఆఫర్ చేస్తున్న కంపెనీల గురించి తెలుసుకోవడానికి మీరు 5Paisa వంటి ప్లాట్‌ఫారమ్‌ల సహాయం తీసుకోవచ్చు. 5Paisa ద్వారా మీకు అవసరమైన మొత్తం సమాచారాన్ని, వివరాలను పొందవచ్చు. సాధారణంగా, ఆఫర్ ధర షేర్లలో ట్రేడింగ్ చేసే ధర కంటే ఎక్కువగా ఉంటుంది. బహిరంగ మార్కెట్ విధానంలో కంపెనీ ఆఫర్ ధర వరకు ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద షేర్లను బైబ్యాక్ చేస్తుంది.

రిటైల్ ఇన్వెస్టర్ రిజర్వేషన్: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రికార్డు తేదీలో బైబ్యాక్ ఆఫర్లలో చిన్న రిటైల్ ఇన్వెస్టర్లకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆదేశించింది.

ఎన్‌టైటిల్‌మెంట్ రేషో: మొత్తం రిటైల్ ఇన్వెస్టర్ కేటగిరీలో ఉన్న మొత్తం షేర్ల సంఖ్యతో పోలిస్తే, రిటైల్ ఇన్వెస్టర్ బైబ్యాక్‌లో ఆఫర్ చేసిన షేర్ల నిష్పత్తి తప్ప, అర్హత నిష్పత్తి మరొకటి కాదు.

మొత్తం రిటైల్ ఇన్వెస్టర్ కేటగిరీలో ఉన్న మొత్తం షేర్ల సంఖ్యతో పోలిస్తే, రిటైల్ ఇన్వెస్టర్ బైబ్యాక్‌లో ఆఫర్ చేసిన షేర్ల నిష్పత్తి, మొత్తం రిటైలర్‌ షేర్స్‌ నిష్పత్తిగా ఉంటుంది. ఇది మొత్తం రిటైల్ వాటాదారుల సంఖ్యతో కలిపిన ఆఫర్ ముగిసే సమయానికి పెట్టుబడిదారులు అందించే మొత్తం షేర్ల సంఖ్యగా లెక్కిస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఆఫర్‌లో కలిగి ఉన్న అన్ని షేర్లను టెండర్ చేయడానికి స్వేచ్ఛగా ఉన్నప్పటికీ, అవన్నీ అంగీకరించాల్సిన అవసరం లేదు.

యాక్సెప్టెన్స్‌ రేషో: ఇది టెండర్ చేసిన మొత్తం షేర్ల సంఖ్యతో పోలిస్తే బైబ్యాక్ ఆఫర్‌లో అంగీకరించగలిగే షేర్ల సంఖ్య.

మనీ మేకింగ్‌: రిటైల్ పెట్టుబడిదారులు తమ ప్రస్తుత షేర్లను టెండర్ చేయడానికి లేదా ఆఫర్ ధర కంటే తక్కువ విలువతో ట్రేడింగ్ చేసే కొత్త షేర్లను కొనుగోలు చేయడానికి బైబ్యాక్ అవకాశాన్ని ఉపయోగించవచ్చు. ఆఫర్ ధర వద్ద ఎంత ఎక్కువ షేర్లు ఆమోదించగలిగితే షేర్ హోల్డర్‌కు అంత ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు: టెండర్ ఆఫర్ రూట్ ప్రాసెస్ ద్వారా బైబ్యాక్‌లో పాల్గొనడానికి, పెట్టుబడిదారు కంపెనీ షేర్‌లను బైబ్యాక్ కోసం ప్రకటించిన రికార్డ్ తేదీ కంటే ముందే కలిగి ఉండాలి. షేర్లను డీమ్యాట్ రూపంలో ఉంచాలి.

Related Posts

Business

చెక్క చిప్స్ మార్కెట్ పరిమాణం, 2025-2032 కోసం అంచనా వేయబడిన ఔట్‌లుక్

“తుది నివేదిక ఈ చెక్క చిప్స్ మార్కెట్పై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరియు COVID-19 ప్రభావం యొక్క విశ్లేషణను జోడిస్తుంది-
చెక్క చిప్స్ మార్కెట్ (2025-2032) పరిశోధన నివేదిక మార్కెట్లోని వివిధ రకాల మరియు అప్లికేషన్ల

Business

నిజమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ మార్కెట్ 2025: గ్రోత్ & కోవిడ్ 19 ఇంపాక్ట్ అనాలిసిస్ 2032

“తుది నివేదిక ఈ నిజమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ మార్కెట్పై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరియు COVID-19 ప్రభావం యొక్క విశ్లేషణను జోడిస్తుంది-
నిజమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ మార్కెట్ (2025-2032) పరిశోధన నివేదిక మార్కెట్లోని వివిధ రకాల

Business

ఫోర్స్కోలిన్ మార్కెట్ విశ్లేషణ మరియు సమీక్ష 2025-2032 | 112 పేజీల నివేదిక

“తుది నివేదిక ఈ ఫోర్స్కోలిన్ మార్కెట్పై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరియు COVID-19 ప్రభావం యొక్క విశ్లేషణను జోడిస్తుంది-
ఫోర్స్కోలిన్ మార్కెట్ (2025-2032) పరిశోధన నివేదిక మార్కెట్లోని వివిధ రకాల మరియు అప్లికేషన్ల సమగ్ర

Business

2032 నాటికి సేవలు అభివృద్ధి చెందడం ద్వారా గ్లోబల్ వాతావరణ అంచనా సేవలు మార్కెట్ వృద్ధికి సిద్ధంగా ఉంది

“తుది నివేదిక ఈ వాతావరణ అంచనా సేవలు మార్కెట్పై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరియు COVID-19 ప్రభావం యొక్క విశ్లేషణను జోడిస్తుంది-
వాతావరణ అంచనా సేవలు మార్కెట్ (2025-2032) పరిశోధన నివేదిక మార్కెట్లోని వివిధ రకాల