తెలంగాణలో ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ సాయం.. ఎవరెవరికి ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు?

News

గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్ విధించింది మొదలు… ఇప్పటివరకూ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో జీతాలు ఆగిపోవడంతో కూలీలుగా మారిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కూరగాయల దుకాణాలు, చాయ్ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు పెట్టుకున్న ఉదంతాలు కూడా చూశాం. తెలంగాణలో దాదాపు ఏడాది విరామం తర్వాత తిరిగి గత ఫిబ్రవరిలో స్కూళ్లు ప్రారంభమవడంతో వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో కొద్ది రోజులకే మళ్లీ పాఠశాలలను ప్రభుత్వం మూసేయాలని ఆదేశించింది.

దీంతో ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రభుత్వం తమను ఎలాగైనా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాలు చాలా కాలంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారికి సాయం అందించేలా తాజాగా నిర్ణయం తీసుకుంది.

పాఠశాలలను మళ్లీ తెరిచే వరకూ ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి నెలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయంతోపాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర సీఎం కేసీఆర్ గురువారం ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 10,807 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఉపాధ్యాయులుగా సుమారు 1.28 లక్షల మంది పనిచేస్తున్నారు. మరో 17 వేల మంది బోధనేతర సిబ్బందిగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన ఆర్థిక సాయం రూపంలోనే ప్రభుత్వం వీరి కోసం నెలకు సుమారు రూ.29 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయుల సంఖ్య రెండు లక్షలకుపైగానే ఉందని తెలంగాణలోని గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (టీఆర్ఎస్ఎంఏ) అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు బీబీసీతో అన్నారు.

ప్రభుత్వ సాయానికి అర్హులైనవారు తమ బ్యాంకు ఖాతా సహా ఇతర వివరాలను తెలియజేస్తూ జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మలను విధివిధానాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ అంశమై వీరు జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, డీఎస్‌వోలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత మంత్రి గంగుల కమలాకర్ బీబీసీతో మాట్లాడుతూ… అర్హులను ఏ ప్రాతిపదికన గుర్తించబోతున్నారో వివరించారు.

Related Posts

News

వందే భారత్ స్లీపర్: న్యూ ఢిల్లీ-కాశ్మీర్ రూట్‌లో కొత్త రైలు ప్రయాణం

జనవరి 2025 నుండి కొత్త రైలు సేవలు ప్రారంభం
భారతీయ రైల్వే వ్యవస్థలో వందే భారత్ రైళ్లు కీలక మార్పులకు నాంది పెట్టాయి. వేగం, సౌకర్యం, ప్రయాణంలో అనుభవానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఈ రైళ్లు

News

వారానికి 6 రోజులు పని చేయాలా? 5 రోజులు చాలు!

నేటి వేగంగా మారుతున్న జీవన విధానంలో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువసేపు పనిచేయడం వల్ల వారు కుటుంబంతో గడిపే సమయం తగ్గి, మానసిక, శారీరక ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ నష్టం కలిగించే

News

సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌: రైల్వే షాకింగ్ నిర్ణయం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు భారతీయ రైల్వేలోకి ప్రవేశించిన తర్వాత ప్యాసింజర్ల నుండి మంచి స్పందన లభించింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ రైళ్లకు విశేష డిమాండ్ ఉంది. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా, ప్రయాణికులకు

News

టాటా మోటార్స్ షేర్లు 5% కుప్పకూలాయి; UBS 20% తగ్గుదల అవకాశాన్ని చూసింది

సెప్టెంబర్ 11న ప్రారంభ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్లు దాదాపు 5 శాతం పడిపోయి, నిఫ్టీ 50లో అత్యధిక నష్టాల్లో ఒకటిగా నిలిచాయి. ఉదయం 09.52 గంటలకు టాటా మోటార్స్ షేర్లు NSEలో రూ.