Google Pay FD: ఎలాంటి బ్యాంకు ఖాతా తెరవకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై స్పందించిన గూగుల్‌ పే

Business

Google Pay: టెక్‌ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్‌ పే తాజాగా ఫిక్సిడ్‌ డిపాజిట్లు కూడా ఆఫర్‌ చేస్తోందన్న వస్తున్న వార్తల నేపథ్యంలో కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలను..

Google Pay: టెక్‌ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్‌ పే తాజాగా ఫిక్సిడ్‌ డిపాజిట్లు కూడా ఆఫర్‌ చేస్తోందన్న వస్తున్న వార్తల నేపథ్యంలో కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలను నేరుగా ప్రస్తావించకుండా.. తాము సంస్థలతో భాగస్వామ్యం ద్వారానే భారత్‌లో సర్వీసులు అందిస్తున్నామని గూగుల్‌ పే స్పష్టం చేసింది. పలు సందర్భాలలో కొన్ని ఆఫర్లను తామే స్వయంగా అందిస్తున్నామనే వార్తలు వస్తున్నాయని, అవి వాస్తవం కాదని ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. చాలా వ్యాపారాలు కొత్త వినియోగదారులకు చేరువయ్యేందుకు తమ ప్లాట్‌ఫాం ఒక మాధ్యమంగా ఉపయోగపడుతోందని గూగుల్‌ పేర్కొంది.

కాగా, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో డిజిటల్‌గా ఫిక్సిడ్‌ డిపాజిట్లు తెరిచే సౌలభ్యాన్ని గూగుల్‌ పే ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఖాతాదారు ప్రత్యేకంగా సేవింగ్స్‌ ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్‌ ఖాతా తెరవకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ చేసే సదుపాయం పరిశ్రమలో తొలిసారిగా తాము ఆఫర్‌ చేస్తున్నట్టు ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (SFB) ప్రకటించింది. ఒక ఏడాదిపాటు చేసే ఎఫ్‌డీలపై 6.35 శాతం వరకు వడ్డీ ఉంటుందని ఫైనాన్స్‌ బ్యాంక్‌ పేర్కొంది. రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ గ్యారంటీ ఉంటుందని వివరించింది. ఎలాంటి బ్యాంకు ఖాతా లేకుండా గూగుల్‌ పేలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే ప్రక్రియ రెండు నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు.

కాగా, వివిధ బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఇక చిన్న చిన్న బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

Related Posts

Business

PMEGP పథకం: 35% సబ్సిడీతో రూ.25 లక్షల వరకు రుణాలు – కేంద్రం నుండి కొత్త వ్యాపార ప్రారంభానికి పెద్ద పుష్కరం

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత, చేతివృత్తి కార్మికులు వంటి వారికి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద తయారీ, సేవల

Business

ఓపెన్‌ఏఐ 150 బిలియన్ డాలర్ల మూల్యంతో నిధుల సేకరణ చర్చల్లో – బ్లూమ్‌బర్గ్ న్యూస్ నివేదిక

చాట్‌జీపీటీ వంటి పాపులర్ చాట్‌బాట్‌ని రూపొందించిన ఓపెన్‌ఏఐ, సుమారు 6.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిదారుల నుండి సేకరించేందుకు చర్చిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఈ నిధుల సేకరణకు సంబంధించి బ్యాంకుల నుంచి మరో 5 బిలియన్

Business

నిఫ్టీ 50 25,000 మార్క్‌ను తిరిగి పొందింది; ఐటీ, ఔషధ రంగ స్టాక్స్ ఆధారంగా సెన్సెక్స్ ర్యాలీ

మంగళవారం నాడు నిఫ్టీ 50 సూచీ 25,000 మార్క్‌ను దాటింది, అలాగే సెన్సెక్స్ కూడా వాల్ స్ట్రీట్‌లో లాభాలు నమోదు కావడంతో ర్యాలీ చేసింది, ఔషధ రంగ స్టాక్స్ కూడా పెరిగాయి. ఈ పెరుగుదల

Business

టాటా పవర్‌ షేర్లపై దృష్టి: తమిళనాడులోని టాటా గ్రూప్‌ సంస్థ సౌరకణాల ఉత్పత్తిని ప్రారంభించింది

మంగళవారం ఉదయం టాటా పవర్ కంపెనీ లిమిటెడ్‌ షేర్లపై పెట్టుబడిదారుల దృష్టి ఉంది, ముఖ్యంగా టాటా గ్రూప్‌ సంస్థ తమ 4.3 గిగావాట్ల సౌర కణాలు మరియు మాడ్యూల్ ఉత్పత్తి ప్లాంట్‌ను తమిళనాడులోని తిరునెల్వేలిలో