LPG Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

News

హోలీకి ముందు సామాన్య ప్రజలకు పెట్రోలియం సంస్థలు గట్టి షాకిచ్చాయి. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ. 350.50 పెంచేశాయి.

LPG Cylinder Price: హోలీకి ముందు సామాన్య ప్రజలకు పెట్రోలియం సంస్థలు గట్టి షాకిచ్చాయి. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ. 350.50 పెంచేశాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల పెంపుతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ ధరలు భారీగా పెరగడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది.

గతేడాది జూలై 1న డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరిగాయి. మరోసారి.. ఎనిమిది నెలల తరువాత వీటి ధరలను పెట్రోలియం సంస్థలు భారీగా పెంచేశాయి. తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరను పరిశీలిస్తే.. ప్రస్తుతం రూ.1053 నుంచి రూ. 1103కు చేరింది. ముంబైలో రూ. 1052.50 నుంచి రూ. 1102.50కి పెరిగింది. అదేవిధంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎల్పీజీ ధర రూ. 1769 ఉండగా.. తాజాగా పెరిగిన ధరతో రూ. 2119.50కి చేరింది. ముంబైలో ప్రస్తుతం రూ. 1721 ఉండగా రూ. 2071.50కి పెరిగింది. అయితే, ఈ ఏడాది కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు పెరగడం ఇది రెండోసారి.

గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య ప్రజలపై ఆర్థికంగా భారం కానుంది. తాజాగా ధరల పెంపుతో తెలుగు రాష్ట్రాల్లో ధరలను పరిశీలిస్తే.. మంగళవారం వరకు హైదరాబాద్ లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,105 ఉంది. తాజా పెంపుతో నేటి నుంచి రూ. 1,155 పెరిగింది. అదేవిధంగా ఏపీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1161 కి చేరింది.

Related Posts

News

వారానికి 6 రోజులు పని చేయాలా? 5 రోజులు చాలు!

నేటి వేగంగా మారుతున్న జీవన విధానంలో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువసేపు పనిచేయడం వల్ల వారు కుటుంబంతో గడిపే సమయం తగ్గి, మానసిక, శారీరక ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ నష్టం కలిగించే

News

సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌: రైల్వే షాకింగ్ నిర్ణయం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు భారతీయ రైల్వేలోకి ప్రవేశించిన తర్వాత ప్యాసింజర్ల నుండి మంచి స్పందన లభించింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ రైళ్లకు విశేష డిమాండ్ ఉంది. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా, ప్రయాణికులకు

News

టాటా మోటార్స్ షేర్లు 5% కుప్పకూలాయి; UBS 20% తగ్గుదల అవకాశాన్ని చూసింది

సెప్టెంబర్ 11న ప్రారంభ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్లు దాదాపు 5 శాతం పడిపోయి, నిఫ్టీ 50లో అత్యధిక నష్టాల్లో ఒకటిగా నిలిచాయి. ఉదయం 09.52 గంటలకు టాటా మోటార్స్ షేర్లు NSEలో రూ.

News

ఆథర్ ఎనర్జీ IPOకి సిద్ధం, రూ. 3,100 కోట్ల తాజా షేర్ల విడుదలతో సహా

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఆథర్ ఎనర్జీ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ ఐపీఓలో రూ. 3,100 కోట్ల విలువైన తాజా